Anam Ramnarayana Reddy : ఆర్దికశాఖకు ప్రత్యేక ప్రమాణాలు నేర్పిన ఆర్దిక దిగ్గజం | ABP Desam
మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఓ అరుదైన అనుబంధం ఉంది. రోశయ్య తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి పనిచేశారు. ఇద్దరూ వైఎస్ఆర్ హయాంలో మంత్రి వర్గంలో ఉన్నారు. రోశయ్య మరణం తనని కలచి వేసిందని చెప్పారు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆర్థిక శాఖకు ఓ ప్రత్యేక ప్రమాణాలను నెలకొల్పిన వ్యక్తిగా రోశయ్యను కొనియాడారు.