High Tension In Amaravathi: 144 సెక్షన్, పోలీసుల అదుపులో టీడీపీ నాయకులు

అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక మాఫియాపై ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు నంబూరు శంకర్ రావు, కొమ్మాలపాటి శ్రీధర్ పరస్ఫర సవాళ్లు విసురుకున్నారు. అమరావతి అమరలింగేశ్వర ఆలయంలో ప్రమాణం చేయాలని ఇరువురూ ఒకరికొకరు సవాల్ చేసుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఇద్దరూ అనుచరులతో భారీ ఎత్తున అమరావతికి వచ్చారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.... కొమ్మాలపాటి శ్రీధర్, టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola