Minister Kodali Nani : సినిమాల్లో కలిసి పని చేసినంత మాత్రాన.. అతను చెబితే వినాలా..?
జూనియర్ ఎన్టీఆర్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కొడాలి నాని అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన...నందమూరి కుటుంబం తనపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జూనియర్ ఎన్టీఆర్...కొడాలి నానిని కంట్రోల్ చేయాలని వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టిన మంత్రి....ఎన్టీఆర్ చెబితే వినాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఒకప్పుడు కలిసి చిత్రపరిశ్రమలో పని చేశామని విబేధాల కారణంగా దూరమయ్యామని అన్నారు.