AP Government: జీవోలన్నీ బయటపెట్టాలన్న తెలంగాణ హైకోర్టు... ఏపీలో ఏమవుద్ది..?
ప్రభుత్వం ఇచ్చే జీవోలను బయటపెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు గట్టిగా చెప్పింది. ఇప్పుడు ఈ విషయంపై తెలంగాణలో కంటే... ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎందుకంటే... ఇటీవలే జీవోలు ఆన్‌లైన్‌లో పెట్టొద్దని ప్రభుత్వం అన్ని శాఖలకు అదేశించింది. పబ్లిక్‌లో ఉంచకూడదని ఉత్తర్వులు ఇచ్చింది. అర్థరాత్రి జీవోలు ఇచ్చే ప్రభుత్వం ఒక్కసారిగా జీవో పోర్టల్ మూసివేయడం చర్చనీయాంశమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీవోలపై విమర్శలు చేసింది వైసీపి. ఇప్పుడు మాత్రం రహస్య జీవోలకే మొగ్గు చూపుతోంది. తెలంగాణ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిక్కులు తప్పవనే వాదన బలంగా వినిపిస్తోంది.