Amaravati Judges Houses: అమరావతిలో న్యాయమూర్తుల ఇళ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు
Amaravati Judges Houses: ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతిలో అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి గురువారం ఆయన అమరావతిలో పర్యటించారు. ప్రజావేదిక కూల్చేసిన చోటు నుంచి ఆయన పర్యటన ప్రారంభం కాగా.. అక్కడి శిథిలాలు, నిర్మాణం కాని అసంపూర్తిగా ఉన్న భవనాలను పరిశీలించారు. ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం వద్ద సీఎం చంద్రబాబు మోకాళ్లపై కూర్చుని సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అమరావతికి గుడ్ న్యూస్ చెప్పింది. అక్కడి కొత్త రైల్వే లైన్‌కు క్లియరెన్సులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రైల్వే శాఖ.. అమరావతి రైల్వే లైన్ భూ సేకరణకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.
భూ సేకరణ వ్యయం భరించాలి అనే షరతులతో కాలయాపన చేసిన రైల్వే శాఖ.. ఇప్పుడు అవేమీ లేకుండానే పూర్తిగా తమ నిధులతోనే రైల్వే లైన్ నిర్మాణానికి ముందుకొచ్చింది. ప్రధానంగా ఎర్రుపాలెం - అమరావతి - నంబూరు మధ్య భూ సేకరణకు ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించిన కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.