Amaravati Farmers Protest: మమ్మల్ని ఆధార్ కార్డులు అడుగుతున్నారు.. పోలీసులకు ఐడీ కార్డులు ఉండవా?

అమరావతి ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు హైకోర్టు వద్దకు వెళ్లేందుకు సిద్ధమైన రాజధాని ప్రాంత రైతులు, మహిళలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో మందడం, వెంకటపాలెంలో ఉద్రిక్తత  నెలకొంది. వెంకటపాలెంలో రైతుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో గ్రామస్థులు నిరసన తెలిపారు. మందడంలో రైతులు, మహిళలను అడ్డుకోవడంతో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. పోలీసులు మహిళా రైతులను ఆధార్ కార్డులు చూపించాలని అడిగారు. మీరు ఐడీ కార్డులు చూపించండని పోలీసులను మహిళలు ప్రశ్నించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola