వీఐపీ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న సినీనటి శ్రీదేవి
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడిని సినీ నటి శ్రీదేవి విజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా... ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.