Actor Nagarjuna : విజయవాడకు వచ్చి సీఎం జగన్ ను కలిసిన హీరో నాగార్జున
సినీహీరో నాగార్జున ఏపీ సీఎం జగన్ ను కలిశారు. విజయవాడకు వచ్చిన నాగ్....సీఎం జగన్ నివాసానికి వెళ్లి ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమావేశం అనంతరం మాట్లాడిన నాగార్జున... జగన్ ను కలిసి చాలా కాలమైందని అందుకే వచ్చానని..ఇద్దరూ కలిసి లంచ్ చేశామని తెలిపారు. అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు.