AB Venkateswara Rao Posting | ఎట్టకేలకు AB వెంకటేశ్వరరావుకు దక్కిన పోస్టింగ్
ఎట్టకేలకు సీనియర్ పోలీస్ అధికారి AB వెంకటేశ్వర రావు కు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ మరియు స్టేషనరీ డీజీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే...! ఈ రోజు సాయంత్రమే ఆయన పదవీ విరమణ చేయనున్నారు.
ఎట్టకేలకు సీనియర్ పోలీస్ అధికారి AB వెంకటేశ్వర రావు కు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ మరియు స్టేషనరీ డీజీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే...! ఈ రోజు సాయంత్రమే ఆయన పదవీ విరమణ చేయనున్నారు. తనను అన్యాయంగా విధుల నుంచి దూరం పెట్టారని గత రెండేళ్లుగా ఏబీ వెంకటేశ్వరరావు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఐతే.. ఇటీవల ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను క్యాట్ ఎత్తివేసింది. దీంతో.. ఈయనను సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. దీంతో..నేడు విజయవాడలోని కార్యాలయంలో ఏబీ వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. యూనిఫాంతో పదవీ విరమణ చేయడం నా కల నెర వేరినట్లుగా భావిస్తున్నానని ఆయన చెప్పారు.