Palnadu is Bad District in India Says SP | పల్నాడు జిల్లాపై ఎస్పీ సంచలన వ్యాఖ్యలు

పల్నాడు జిల్లాను ఉద్దేశించి ఎస్పీ మల్లిక గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోనే కాదు దేశంలోనే చెడు జిల్లా పల్నాడు అన్నారు. పల్నాడు ప్రాంతానికి మంచి పేరు ఉందని, దానిని మీరు చెడగొట్టొద్దని అన్నారు. గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడం, తగలబెట్టడం లాంటివి జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. పోలీసులు అంటే ఎవరికీ భయం లేదని, మొత్తం జిల్లా అంతా అరాచకంగా ఉందని విరుచుకుపడ్డారు. ఇప్పటికి కూడా మంచి జిల్లాగా మారడానికి అవకాశం ఉందన్నారు.

దేశంలోనే పల్నాడు ప్రాంతానికి మంచిపేరు ఉందని.. దాన్ని చెడగొద్దంటూ ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు. ఎన్నికల క్రమంలో జరిగిన గొడవలతో ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లాగా పల్నాడు పేరొందిందని అన్నారు. గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అలాగే, కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడం, షాపులు, వాహనాలు తగలబెట్టడం వంటివి చేస్తే ఉపేక్షించమని అన్నారు. మాచర్ల, నరసరావుపేటలో జరిగిన గొడవలు దేశమంతటా మార్మోగాయని పేర్కొన్నారు. పోలీసులంటే ఎవరికీ భయం లేదని.. మరోసారి జిల్లాలో అల్లర్లు జరిగితే పోలీసులంటే ఏంటో చూపిస్తామని పేర్కొన్నారు. జిల్లా మొత్తం అరాచకంగా ఉందని.. మంచి జిల్లాగా మారడానికి అవకాశం ఉందని అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola