Twitter One Word Trend : ట్విట్టర్ లో ఒకే పదంతో ట్వీట్లు..ఏంటీ గందరగోళం | ABP Desam
సలార్ అప్ డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సడెన్ గా ట్విట్టర్ లో సలార్ అప్ డేట్ వచ్చింది. వయెలెంట్ అని. అంటే ఏంటీ ప్రభాస్ క్యారెక్టర్ వైలెంటా..ఏంటీ వైలెంట్. నాకు తెలియాలి తెలిసి తీరాలి ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేయటం మొదలు పెట్టారు. అప్పుడే అందిన ఇంకో తాజావార్త ఏంటంటే...సరిగ్గా అదే టైంలో కేజీఎఫ్ 2 ట్విట్టర్ అకౌంట్ లో కూడా ఓ ట్వీట్ పడింది. మాన్ స్టర్ అని. సరే రాకీభాయ్ లైక్ ఏ మాన్ స్టర్. We all Know That. కేజీఎఫ్ 3 అనౌన్స్ మెంట్ ఏం లేదు కదా ఇప్పుడెందుకు ట్వీట్ వేశారు అని ఫ్యాన్స్ తెగ తన్నుకుంటున్నారు. రకరకాల మీమ్స్ తో ప్రశాంత్ నీల్ ని ఆడేసుకుంటున్నారు. కూల్ ఇంతకీ మ్యాటరేంటో నేను చెప్తాను.