Moon landing conspiracy theories : అపోలో మిషన్లన్నీ అబద్ధమేనా...ఆర్టెమిస్ ఆపసోపాలు అందుకేనా..ఏంటీ రచ్చ | ABP Desam
యాభై ఏళ్ల క్రితమే చంద్రుడిపైకి మనుషులను పంపిన నాసాను ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇరకాటంలో పడేస్తున్నాయి. ఎందుకంటే 1969-72 మధ్య కాలంలో అపోలో ప్రాజెక్ట్ ద్వారా నాసా చంద్రుడిపైకి మనుషులను పంపించి ఆ తర్వాత నిలిపివేసింది. ఆ తర్వాత ఇప్పటివరకూ ఏ దేశానికి చెందిన స్పేస్ ఏజెన్సీ కూడా తమ మనుషులను చంద్రుడిపైకి పంపించలేదు. అప్పటి సోవియట్ యూనియన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇండియన్ స్పేస్ ఏజెన్సీ, చైనా స్పేస్ ఏజెన్సీ చంద్రుడిపైన ప్రయోగాలను చేశాయి కానీ మనుషులను దింపలేదు. కనుక నాసా కు ఇప్పుడున్న ఎదురవుతున్న ఈ టెక్నికల్ ప్రాబ్లం వాళ్ల పాత ప్రయోగాలపైనా ప్రభావం చూపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అప్పట్లో సోవియట్ యూనియన్ నుంచి స్పేస్ ప్రోగ్రామ్స్ లో ఎదురవుతున్న విపరీతమైన పోటీ తట్టుకోలేక నాసా చంద్రుడిపైకి మనుషులను పంపిచామని కట్టుకథలు అల్లిందంటూ కూడా అనేక కుట్రకోణాల కథలు ప్రచారంలో ఉన్నాయి.