Bandi Sanjay Exclusive Interview | కేసిఆర్ కు పాలిటిక్స్ అంటే బఠానీలు. మనుగోడు మాదే. | ABP Desam
రెట్టించిన ఉత్సాహంతో మూడో విడత పాదయాత్ర కొనసాగుతుంది నల్గొండ జిల్లాలో పర్యటిస్తుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. ఫ్లోరైడ్ సమస్యతో పాటు అనేక సమస్యలతో నల్గొండ జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. బిజెపి గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉంది అని చెప్పడానికి ఈ మూడో విడత పాదయాత్ర ఉదాహరణ. బిజెపిని భద్రం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. బీరు బిర్యానీ కోసం జనం రావడం లేదు స్వచ్ఛందంగా వస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి సంవత్సర కాలం పదవిని వదులుకొని వస్తుండు మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేశాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడుతున్నారు మునుగోడు పరిస్థితి మిగతా చోట్ల ఉంటుంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ పై తిరగబడే రోజు దగ్గరకు వచ్చింది. మరో 13 మంది ఆలోచిస్తున్నారు. కేసీఆర్ మీద నమ్మకం పోయింది. ఆయనది కుటుంబ పాలన ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు. ఆయన ఒక విశ్వాసఘాతకుడు. ప్రజలు సీఎం కేసీఆర్ కుటుంబాన్ని అసహ్యించుకుంటున్నారు. శ్రీలంక లాగానే తెలంగాణ కూడా అవుతుందని ప్రజలు అనుకుంటున్నారు. బిజెపి ప్రశ్నించకుండా ఉంటే మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం ఉన్నది. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్పు తెలుసుకుంటున్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బిజెపికి లోకి రాకుండా కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారు. వారిని మభ్యపెడుతున్నాడు .మేము ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమే. పాలన మీద ప్రజల మీద దృష్టి పడకూడదని ఉప ఎన్నికలతో సీఎం కేసీఆర్ టైం పాస్ చేస్తున్నాడు. మునుగోడు లో బిజెపి గెలుస్తుంది. మునుగోడు ప్రజలు బిజెపికి పట్టం కట్టాలి, లేదంటే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే పడుకుంటాడు. టిఆర్ఎస్ పార్టీకి గర్వం పెరుగుతుంది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ లేదు. ఓట్ల కోసం సీట్ల కోసం బిజెపి నాయకులు పనిచేయరు. ప్రజల్లో మంచి పేరు ఉన్న నాయకులకు ఎవరు వచ్చిన ఆహ్వానిస్తాం. సముచిత స్థానం ఇస్తాం. త్వరలోనే మునుగోడుకు నిధులు పారబోతున్నాయి. టిఆర్ఎస్ పార్టీ మునుగోడులో ఒక్కొక్క ఓటుకు 30000 పంచబోతుంది. మూసీ నది నీటిని కేసీఆర్ తాగించడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ఏబీపీ దేశం ఇన్ పుట్ ఎడిటర్ గోపరాజుకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు.