WEF| Davos Summit 2022: AP కి లక్షా 25 వేల కోట్లు, Telangana కు 42 వేల కోట్ల పెట్టుబడులు| ABP Desam
CM హోదాలో తొలి సారి దావోస్‌కు వెళ్లిన సీఎం జగన్ రూ.లక్షా 25 వేల కోట్ల పెట్టుబడులకు MOU లు చేసుకున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం.... దావోస్ వేదికగా చక్కటి ఫలితాలు సాధించిందని ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన కూడా ముగిసింది. తెలంగాణకు సుమారు 42 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 45 కంపెనీలతో సమావేశాలు, నాలుగో రౌండ్ టేబుల్ మీటింగ్లు, 4 ప్యానెల్ డిస్కషన్స్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.