Uttarandhra Politics | ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటోంది ప్రజలా..? లేదా రాజకీయ నాయకులా..? | ABP Desam
మూడు రాజధానుల విషయమే ఎటూ తేలక ఏపీ ప్రజానీకం ఎదురుచూస్తుంటే.. ఇప్పుడు మరో డిమాండ్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్టం కావాలన్న వాదన ఊపందుకుంటోంది. ప్రభుత్వంలో కీలకమైన సీనియర్ మంత్రి ధర్మాన.. ఉత్తరాంధ్ర రాష్ట్రం ఊసెత్తి వారం కాకముందే జై ఉత్తరాంధ్ర పేరుతో పార్టీని పెట్టేందుకు కొంతమంది సన్నాహకాలు కూడా చేస్తున్నారు. ఉత్తరాంధ్ర డిమాండ్ నిజంగా ఉందా.. ప్రభుత్వం నడిపిస్తున్న మూడు రాజధానుల ప్రణాళికలో ఇదొక భాగమా.. నిజంగా ఉత్తరాంధ్ర నినాదం ఊపందుకుంటుందా లేక రాయలసీమ పార్టీల్గాగా నినాదాలకే.. పరిమితమవుతుందా.. ప్రస్తుతానికైతే ఇవన్నీ ప్రశ్నలే