Telangana Assembly : వర్షాకాలంలో వేడి వేడి గా సమావేశాలు. | ABP Desam

Continues below advertisement

గత బడ్జెట్ సమావేశాలు మార్చి 15న ముగిసాయి. ఆరు నెలలోపు మల్లీ సెషన్స్ ప్రారంభించాల్సి ఉంది. ఈ లెక్కన సెప్లెంబర్ 14లోపు సెషన్స్ ప్రారంభంకావాలి. అందుకే ఆరో తేదీని ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కార్యాచరణ అంతా మునుగోడు కోసమా లేక ముందస్తు ఎన్నికలకు వెళ్ళే వ్యూహమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. జరుగుతున్న పరిణామాలు డిఫరెంట్ గా ఉండటంతో ఈ సమావేశాల్లో ఏ అంశాలు చర్చిస్తారనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ కు సెప్టెంబర్ సెంటిమెంట్ కూడా ఉండటంతో జరుగుతున్న చర్చలకు బలం చేకూరుతుంది. మునుగోడు ఉపఎన్నికకు సమయం దగ్గరపడుతున్నవేళ శనివారం ఒకే రోజు కేబినెట్, టీఆర్ఎస్ఎల్పీ సమావేశాలు నిర్వహించడంతో పాటు రెండు రోజుల గ్యాప్‌తో అసెంబ్లీని కూడా సమావేశ పర్చడం హాట్ టాపిక్‌ అవుతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram