BJP Plan of Action in Telangana : ఓ వైపు పాదయాత్ర మరోవైపు అసెంబ్లీ అభ్యర్థుల కసరత్తు | ABP Desam

10 రోజులు... 9 అసెంబ్లీ నియోజకవర్గాలు... 115.3 కి.మీలు బండి సంజయ్ నాలుగోవిడత పాదయాత్ర. ఖరారైన 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్. 12న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రారంభం... 22న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ముగింపు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టనున్న 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. మొత్తం 10 రోజులపాటు పాదయాత్ర కొనసాగనుంది. 4వ విడతలో భాగంగా మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115.3 కి.మీల మేర పాదయాత్ర కొనసాగనుంది. కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభించనున్న బండి సంజయ్ కుమార్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ముగించనున్నారు. ఈనెల 17న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవాలకు హాజరుకానున్న నేపథ్యంలో ఆ రోజు పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే... కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola