Social Media Hackers : ఏ లింక్ పడితే అది నొక్కేయకండి..!
దేశవ్యాప్తంగా ప్రతి రోజు చాలా మంది సైబర్ నేరగాళ్ల చేతుల్లో చిక్కుతుంటారు. అయితే మాములు జనంతో పాటు సెలబ్రిటీలు సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడే అవకాశాలు ఎక్కువే ఉంటాయి. వాళ్ల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ చేసి వివిధ రకాలుగా అసభ్యకర పోస్టులు, మెసేజ్ లు పంపించి వారిని ఇబ్బందుల్లో పడేస్తారు. తాజాగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా ఫేం అమృత అయ్యర్ సోషల్ మీడియా అకౌంట్ ను హ్యాక్ చేసిన విషయం తెలిసిందే. తను కాకుండా సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా మంది అకౌంట్లే హ్యాక్ అయ్యాయి.