PM Modi Pawan Kalyan Meeting: ఏపీకి మంచి రోజులు ఎప్పుడు? ఎలా?
ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత రాజకీయవర్గాల్లో మరింత చర్చ జరుగుతోంది. పవన్ - మోడి ఏం మాట్లాడుకున్నారు? ఏయే అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి? భవిష్యత్ లో ఎలా ముందుకు వెళ్లబోతున్నారు అనే అంశాన్నే ఏపీ రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. అసలు వీరి మద్య చర్చ కు వచ్చిన అంశాలు ఏమిటో తేలాలంటే భవిష్యత్ లో ఈ రెండు పార్టీలు అనుసరించే వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రణాళికలపైనే ఉంటుందని అంతా అనుకుంటున్నారు.