Joshimath Sinking : గోడలకు పగుళ్లు..కుప్పకూలిపోతున్న ఇళ్లు..జోషి మఠ్ వేదన | ABP Desam
హిమాలయాల్లో అందంగా కనిపించే ఆ ఊరు ఇప్పుడు కళ్ల ముందే కుంగిపోతోంది. ఒకటి కాదు రెండు కాదు గడచిన పన్నెండుల్లో రోజుకు 5.4 సెంటీమీటర్ల మేర లోపలికి కుంగిపోయింది ఆ ఊరు మొత్తం. ఇళ్లన్నీ పగుళ్లు..గోడలన్నీ నెర్రెలిచ్చుకుపోయాయి...రోడ్ల మీద ఎక్కడ చూసినా భారీ గోతులు...ఎంతో ప్రేమగా కట్టుకున్న ఇళ్లను వదల్లేక..మనసు రాక కొన్ని వందల మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎస్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లా జోషి మఠ్ దీన అవస్థ ఇది.