Elon Musk Buys Twitter: 44 బిలియన్ డాలర్లకు భారీ డీల్ | ABP Desam
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని ప్రకటించిన బిలియనీర్ ఎలాన్ మస్క్ అనుకున్నది సాధించారు. ట్విట్టర్‌ను సొంతం చేసుకుంటానని ప్రకటించిన 10 రోజులకు కీలక పరిణామం జరిగింది. ట్విట్టర్ బోర్డుతో ఎలాన్ మస్క్ చర్చలు సఫలమయ్యాయి. దాదాపు 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ కొనుగోలుకు ఎలాన్ మస్క్ డీల్ కుదుర్చుకున్నారు.