Amaravati Vs Vizag | అంధ్రప్రదేశ్ లో అగ్గిరాజుకోనుందా? పాలిటిక్స్ కోసం ఏమైనా చేస్తారా? | ABP
ఏపీలో మళ్లీ పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయ్యింది. రాజధాని అంశంగా రాజకీయపార్టీల మద్య మాటల యుద్దం మొదలైంది. కొన్ని పార్టీలు ఒకే ప్రాంతానికి పరిమితమయ్యే రాజకీయపార్టీలు ఎత్తుగడలు వేస్తున్నాయి. అమరావతి రాజధానిగా ఉండాలని టీడీపీ, బీజేపీ, జనసేన అంటున్నాయి. కాదు, అమరావతి తోపాటు వైజాగ్, కర్నూలు కూడా రాజధానులుగా ఉండాలని కోరుతోంది వైసీపీ. తాజాగా అమరావతి రైతుల మహాపాదయాత్ర అరసవెల్లి వరకూ ప్రారంభించారు. అమరావతి రైతులు తిరుపతి యాత్రకు ఎక్కడా పెద్దగా అడ్డు రాలేదు కానీ ఉత్తరాంధ్ర యాత్రకు మాత్రం అడ్డంకులు వచ్చే అవకాశం లేకపోలేదు. రైతుల పాదయాత్రతో వైజాగ్ వికేంద్రీకరణకు అనుకూలం జేఏసీ ఏర్పడింది. అంతేకాదు రాజీనామాలకు కూడా వైసీపీ ఎంపీలు సిద్దపడ్డారు. దీంతో అంధ్రప్రదేశ్ లో మరోసారి పొలిటికల్ వార్ కు తెరలేపింది రాజధాని అంశం.