ముంబయిలో భయానక సంఘట ఒకటి చోటు చేసుకుంది. వాసాయ్ రోడ్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. కదులుతున్న రైలును ఓ మహిళ ఎక్కబోయింది. దీంతో ఆమె సరిగ్గా రైలు ఎక్కలేక కిందపడింది. కానీ, లక్కీగా ఆమె ప్రాణాలతో బయటపడింది. 


స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీలో ఈ సీనంతా రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో ట్విటర్లో కూడా వైరల్‌గా మారింది. కదులుతున్న రైలును పొరపాటున ఎక్కుతూ గతంలో చాలా  మంది ప్రాణాలు కోల్పోయిన వార్తలను మనం గతంలోనూ చదివాం. అయినప్పటికీ ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటూనే ఉన్నాయి.






అసల అక్కడ ఏం జరిగిందంటే... రైలు కదిలిన తర్వాత ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు అటుగా వచ్చారు. రైలు ఎక్కేందుకు ప్రయత్నించారు. వారిలో ఓ మహిళ కొంచెం ప్రయత్నించి రైలు ఎక్కబోయింది. కానీ, ప్రమాదవశాత్తూ ఆమె పడిపోయింది. వెంటనే పక్కన ఉన్న, సమీపంలో ఉన్న ప్రయాణికులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. 






అక్కడే రైల్వే పోలీసులు కూడా వచ్చారు.  వెంటనే ఆమెను రైల్వే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. మెట్రో రైలుకి లాగా ఈ రైళ్లకు ఆటోమేటిక్ తలుపులు పెట్టాలని, మూవింగ్ ట్రైన్ ఎక్కేవాళ్లకి ఫైన్ వేయాలని తదితర సూచనలిస్తూ కామెంట్లు చేస్తున్నారు.