ఏప్రిల్‌ 14న బీఆర్‌ అంబేద్కర్ జయంతి లేదా అంబేద్కర్ జయంతి లేదా భీమ్‌ జయంతిగా చేసుకుంటారు. 1891 ఏప్రిల్ 14న జన్మించిన అంబేద్కర్ చేసిన సేవలకు గుర్తుగా ప్రతి ఏటా దీన్ని నిర్వహిస్తుంటారు. 


భారత దేశంలో సమసమాజ స్థాపన కోసం అంబేద్కర్ తన జీవితాంతం పోరాడారు. ప్రపంచంలోని అతి గొప్పదైన రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజలకు అందజేసిన మహా వ్యక్తి. ఆయన స్ఫూర్తి నేటికీ కొనసాగుతూనే ఉంది. ఆయన చూపిన బాటలో లక్షల మంది నేటికీ నడుస్తూనే ఉన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంటోందీ దేశం. 


అంతటి స్ఫూర్తి ప్రదాతను కొన్ని కొటేషన్లుతో స్మరించుకుందా.. శుభాకాంక్షలు చెబుదాం..


అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు



  • బీఆర్‌ అంబేద్కర్ సేవలకు ప్రణమిల్లుదాం- ఆయన స్ఫూర్తిని భావి తరాలకు అందిద్దాం

  • బీఆర్‌ అంబేద్కర్ జీవితం ఒక పవిత్ర గ్రంథం - అందులోని ప్రతి పదం ఒక స్ఫూర్తి మంత్రం 

  • బాబాసాహెద్ ఆశయాలు కొనసాగించడమే ఆయనకు మనం చేసే నిజమైన నివాళి 

  • ప్రజలు బలంగా ఉన్నప్పుడే దేశం బలపడుతుందన్న అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిద్దాం.

  • వివక్షకు వ్యతిరేకంగా, అసమానతలపై పోరాడతామని ప్రతిజ్ఞ చేద్దాం.

  • అంబేద్కర్ జయంతి అంటే మనం ఈ దేశపు బిడ్డలమని, దేశం పట్ల మనకు ఉన్న విధులను గుర్తిద్దాం

  • భారత రాజ్యాంగాన్ని మనకు అందించిన వ్యక్తి ఆశయాలను, కృషిని, త్యాగాలను గౌరవిద్దాం.


బీఆర్‌ అంబేద్కర్‌ కోట్స్‌ కొన్ని.. 



  • స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం బోధించే మతం అంటే ఇష్టం - బీఆర్‌ అంబేద్కర్‌

  • మహిళలు సాధించిన ప్రగతి స్థాయిని బట్టి నేను సంఘం పురోగతిని కొలుస్తాను - బీఆర్‌ అంబేద్కర్‌

  • రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని నేను గుర్తిస్తే, దాన్ని కాల్చే మొదటి వ్యక్తి నేనే - బీఆర్‌ అంబేద్కర్‌

  • లా అండ్ ఆర్డర్ అనేది రాజకీయానికి ఔషధం, శరీర రాజకీయాలు అనారోగ్యం పాలైనప్పుడు, ఔషధం తప్పనిసరిగా ఉపయోగించాలి- బీఆర్‌ అంబేద్కర్‌

  • జీవితం సుదీర్ఘంగా కాకుండా గొప్పగా ఉండాలి - బీఆర్‌ అంబేద్కర్‌

  • మనస్సు విశాలం చేసుకోవడమే మానవ మనుగడకు అంతిమ లక్ష్యం కావాలి - బీఆర్‌ అంబేద్కర్‌

  • సామాజిక దౌర్జన్యంతో పోలిస్తే రాజకీయ దౌర్జన్యం ఏమీ లేదు, ప్రభుత్వాన్ని ధిక్కరించే నాయకుడు కంటే సమాజాన్ని ధిక్కరించే సంస్కర్త చాలా ధైర్యవంతుడు - బీఆర్‌ అంబేద్కర్‌

  • విద్యావంతులుగా ఉండండి, వ్యవస్థీకృతంగా ఉండండి, మంచి చేయాలనే ఆందోళనతో ఉండాలి - బీఆర్‌ అంబేద్కర్‌

  • మీరు గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని విశ్వసిస్తేనే మీకు మీరు సహాయం చేసుకోగలరు, అదే ఉత్తమ సహాయం - బీఆర్‌ అంబేద్కర్‌

  • సామాజిక స్వేచ్ఛ సాధించలేనంత కాలం చట్టం ద్వారా వచ్చే స్వేచ్ఛతో ప్రయోజనం ఉండదు - బీఆర్‌ అంబేద్కర్‌