Who Gossips More Male or Female : మహిళలు గాసిప్‌కు మహారాణులు! అనే నమ్మకం చాలా బలంగా పాతుకుపోయింది. సినిమాలు, సీరియల్స్, సోషల్ మీడియాలో చూస్తే మహిళలను గాసిప్ క్వీన్స్‌గా చిత్రీకరించడం సర్వసాధారణం. మరి నిజంగానే పురుషులు గాసిప్ చేయరా? ఎవరు ఎక్కువ గాసిప్ చేస్తారు? ఈ ప్రశ్నలకు మానసిక శాస్త్రవేత్తలు, సోషల్ సైంటిస్టులు ఏం చెబుతున్నారో తెలిస్తే మనం చాలా ఆశ్చర్యపోతాం. జరుగుతున్న పరిశోధనలు ఈ ప్రచారాన్ని తప్పుపడుతున్నాయి!

Continues below advertisement

ముందుగా, అసలు గాసిప్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. సాంఘిక-వ్యవహార దృష్ట్యా గాసిప్ అంటే కొందరు వ్యక్తులు మాట్లాడుకునే సమయంలో, అక్కడు లేని వ్యక్తుల గురించి చర్చించడం. ఇది సానుకూల (పాజిటివ్), ప్రతికూల (నెగటివ్), లేదా తటస్థ (న్యూట్రల్) రూపాల్లో ఉండవచ్చు.

అపోహను కొట్టిపారేసిన పరిశోధనలు: 

"మహిళలే ఎక్కువ గాసిప్ చేస్తారు" అనే భావన బలంగా ఉన్నప్పటికీ, పరిశోధనలు దీనికి భిన్నమైన వాదన వినిపిస్తున్నాయి.యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్‌సైడ్ (UCR) చేసిన ప్రామాణికమైన అధ్యయనం ఈ అపోహను బలంగా ఖండిస్తోంది. 467 మంది (వీరిలో 269 మంది మహిళలు, 198 మంది పురుషులు) సంభాషణలను వారికి తెలియకుండా రికార్డు చేయగా కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారి 16 గంటల చర్చలో సుమారు 14% గాసిప్‌గా గుర్తించారు. అంటే, సగటున రోజుకు సుమారు 52 నిమిషాలు గాసిప్ చేస్తారని తేలింది. ఈ పరిశోధనలు  మగవాళ్లు, మహిళలు గాసిప్‌లో ఇద్దరూ ఇద్దరేనని చెబుతున్నాయి.

Continues below advertisement

2019లో UCR చేసిన మరో అధ్యయనం ప్రకారం, మహిళలు ప్రతికూల గాసిప్‌ను ఎక్కువ చేయరు. అంతేకాదు, తక్కువ ఆదాయం ఉన్నవారు ధనికుల కంటే ఎక్కువ గాసిప్ చేయరని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ స్టడీలు స్టీరియోటైప్‌ను ఖండించినప్పటికీ, సమాజంలో మహిళలు గాసిప్ ఎక్కువ చేస్తారనే మిత్ కొనసాగడం విచారకరం.

గాసిప్ - కేవలం కాలక్షేపం కాదు, సామాజిక అనుసంధానం: 

ఈ రకమైన జనరలైజేషన్‌లు సమాజంలో మహిళలపై అసమానతను పెంచుతాయని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గాసిప్ అనేది కేవలం కాలక్షేపం కాదు, ఇది సామాజిక కమ్యూనికేషన్‌లో ఒక భాగం, బంధాలను నిర్మించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. 2025లో UCR స్టడీ ప్రకారం, గాసిప్ రొమాన్స్‌కు మంచిదని కూడా అంటున్నారు.

మరి ఎవరు దేని గురించి గాసిప్ చేస్తారు? మహిళలు సాధారణంగా సంబంధాలు, సెక్సువాలిటీ, శారీరక ఆకర్షణ గురించి ఎక్కువ గాసిప్ చేస్తారట. మహిళలు ప్రతికూల గాసిప్‌ను కూడా కన్‌సర్న్ గా మార్చి, తమ ప్రతిష్టను కాపాడుకుంటారని పరిశోధనలు చెబుతున్నాయి. పురుషులు స్పోర్ట్స్, పాలిటిక్స్ గురించి గాసిప్ చేస్తారని ఒక ప్రచారం ఉంది. ఆశ్చర్యకరంగా, యువత ప్రతికూల (నెగటివ్) గాసిప్‌ను ఎక్కువ చేస్తారు. 

సోషల్ మీడియా యుగంలో గాసిప్ - కొత్త కోణం: 

డిజిటల్ జనరేషన్‌లో సోషల్ మీడియా గాసిప్‌ను సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది. వాట్సాప్‌, ఎక్స్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో గాసిప్ తీరు భిన్నంగా ఉంది. మహిళలు సోషల్ మీడియాలో సానుకూల (పాజిటివ్) గాసిప్‌ను ఎక్కువగా పంచుకుంటారు, ఇది వారి సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. మగవాళ్లు మాత్రం గాసిప్‌ను వ్యక్తిగత లేదా వృత్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు.

ముగింపు:

గాసిప్‌ను ఒక సాధనంగా చూసినప్పుడు, దాని ఉపయోగం లింగ భేదాల కంటే సందర్భాలకు, వ్యక్తిత్వానికి ఎక్కువగా ముడిపడి ఉంటుందని అర్థమవుతుంది. మహిళలు గాసిప్ చేస్తారు అనే స్టీరియోటైప్ నిజం కాదని, స్త్రీ, పురుషులిద్దరూ గాసిప్‌లో పాలుపంచుకుంటారని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి, గాసిప్ అనేది లింగ వివక్షకు అతీతమైన ఒక సహజమైన మానవ సామాజిక ప్రవర్తనగా మనం చూడాలి, అనవసరమైన అపోహలను వీడి వాస్తవాలను అర్థం చేసుకోవాలి.