Indian Railways: రైలు ప్రయాణమైనా, బస్సు ప్రయాణమైనా, ఆఖరికి విమానంలో ప్రయాణిస్తున్నా.. చాలా మంది కిటికీల పక్కన కూర్చోవాలని కోరుకుంటారు. కిటికీల నుంచి అలా చూస్తూ ఆస్వాదించాలని అనుకుంటారు. కిటికీల పక్కన కూర్చోవాలన్న కోరిక చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు అందరికీ ఉంటుంది. అయితే ఓ రైలు బోగీకి మాత్రం ఎలాంటి కిటికీలు, తలుపులు ఉండవు. భారతీయ రైల్వేలో రోజుకు 12 వేల కంటే ఎక్కువ రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు అన్నీ వేర్వేరు మార్గాల్లో నడుస్తాయి. వీటిలో ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సూపర్ ఫాస్ట్, సూపర్ ఎక్స్‌ప్రెస్ ఇలా చాలా రకాల రైళ్లు ఉంటాయి. తాజాగా ఈ జాబితాలో వందే భారత్ రైళ్లు కూడా చేరాయి. ఇది కాకుండా, రైల్వేలలో సరుకులను తీసుకెళ్లడానికి గూడ్స్ రైళ్లు, కార్గో రైళ్లు కూడా నడుస్తుంటాయి. అందులో ఎన్‌ఎమ్‌జీ రైళ్లు ప్రత్యేకం. ఎందుకంటే ఈ రైళ్లకు కిటికీలు, తలుపులు ఉండవు. అసలు ఎన్‌ఎమ్‌జీ రైళ్లు అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఎన్‌ఎమ్‌జీ కోచ్‌లకు కిటికీలు, తలుపులు ఉండవు


సాధారణంగా రైళ్లకు కిటికీలు, తలుపులు ఉంటాయి. గూడ్స్, కార్గో రైళ్లకు కిటికీలు, తలుపులు ఉండవు కానీ, అన్ని రకాల రైళ్లకు ఉంటాయి. అయితే ఈ కిటికీలు, తలుపులు లేని రైళ్లను ఎన్‌ఎమ్‌జీ కోచ్ లు అంటారు. అసలు ఈ ఎన్‌ఎమ్‌జీ కోచ్ ‌లు అంటే ఏంటి? ఈ ఎన్‌ఎమ్‌జీ కోచ్ లను ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?


రిటైర్డ్ కోచ్‌కి ఏమవుతుంది?


మనం కూర్చుని ప్రయాణించే రైలు కోచ్‌లు కూడా రిటైర్ అవుతాయి. భారతీయ రైల్వేలో ప్రయాణీకులకు సేవలందిస్తున్న ICF కోచ్ 25 సంవత్సరాలుగా ఉపయోగించబడుతుంది. ఈ సమయంలో, ప్రతి 5 లేదా 10 సంవత్సరాలకు ఒకసారి మరమ్మతులు చేస్తుంటారు.


NMG వ్యాగన్లు దేనికి ఉపయోగిస్తారు?


25 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, ప్యాసింజర్ రైలు నుండి ICF కోచ్ లను తొలగిస్తారు. ఆ తర్వాత, ఈ రిటైర్డ్ కోచ్‌ను NMG (న్యూలీ మాడిఫైడ్ గూడ్స్) రేక్ పేరుతో ఆటో క్యారియర్‌ గా ఉపయోగిస్తారు. కోచ్ ‌ను NMG గా మార్చినప్పుడు, దాని కిటికీలు, తలుపులు అన్నింటిని మూసేస్తారు. కార్లు, ట్రాక్టర్లు, మినీ ట్రక్కులు వంటి వాహనాలను సులువుగా ఎక్కించుకునేలా, అన్ ‌లోడ్ చేసుకునే విధంగా ఈ వ్యాగన్‌ లను సిద్ధం చేస్తారు.


ట్రైన్‌ ట్రాక్‌పై నాణెం పెడితే రైలు బండి పట్టాలు తప్పుతుందా?


రూపాయి, 2 రూపాయిలు, 5 రూపాయిల నాణెం బరువు కొన్ని గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. మరోవైపు వందలాది మందితో వచ్చే ట్రైన్ బరువు వందలాది టన్నుల బరువు ఉంటుంది. ఒక టన్ను అంటే 10 క్వింటాళ్లు, ఒక క్వింటాల్ అంటే 100 కిలోలు, ఒక కిలో అంటే 1000 గ్రాములు. కొన్ని గ్రాములు మాత్రమే బరువు ఉండే ఒక కాయిన్ కోట్లాది గ్రాముల బరువు ఉండే రైలును ఏం చేయగలదు? ఏమీ చేయలేదు. ఒక చిన్న కాయిన్.. వేగంగా వచ్చే టన్నుల బరువు ఉండే రైలును ప్రభావితం చేస్తుందని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.