Viral News: సోషల్ మీడియా వచ్చాక చాలా మంది తమ టాలెంట్ ను ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి వరకు సరైన వేదిక లేక మరుగున పడిన వారు కూడా ఓవర్ నైట్ లో స్టార్లుగా మారుతున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తమ టాలెంట్ తో వీడియోలు క్రియేట్ చేస్తూ వాటిని పోస్టు చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియా యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం నుండి రకరకాల టాలెంట్ లతో ఇంటర్నెట్ లో హల్‌చల్ చేస్తున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి చీర కట్టుకుని బ్రేక్ డ్యాన్స్ చేసింది. హైహీల్స్ వేసుకుని మరీ తను చేసిన డ్యాన్స్ విశేషంగా ఆకట్టుకుంటోంది. తన ఎనర్జీకి, తన స్టెప్స్ కు ఇప్పుడు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
పుల్ జోష్‌తో డ్యాన్స్ ఇరగదీసిన యువతి
ఈ వీడియోలు కనిపిస్తున్న యువతిది నేపాల్. తను ఓ ప్రొఫెషనల్ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, అంతే కాకుండా నేపాల్ హిప్ హాప్ ఫౌండేషన్ సభ్యురాలు కూడా. తన పేరు ఎం జెనీషా. ఇప్పుడు జెనీషా చేసిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లక్షలాది మంది ఈ వీడియోకు లైక్ లు కొడుతున్నారు. తాజాగా ఎం జెనీషా ఓ కమ్యూనిటీ ఈవెంట్ లో పాల్గొంది. హైహీల్స్ వేసుకుని, చీర కట్టుకుని ఆ కార్యక్రమానికి వచ్చింది జెనీషా. ప్రొఫెషనల్ డ్యాన్సర్ కావడం అందులోనూ మాంచి పార్టీ మూడ్, మూడ్ కు తగ్గట్లుగా మ్యూజిక్ రావడంతో జెనీషా ఉరకలేసే ఉత్సాహంతో డ్యాన్స్ మొదలు పెట్టింది. ఫుల్ జోష్ తో తన సహజ శైలిలో డ్యాన్స్ ఇరగదీసింది. హైహీల్స్ వేసుకుని క్లిష్టమైన స్టెప్పులు వేసింది. చీర కట్టులోనే ఆకట్టుకునే డ్యాన్స్ తో అలరించింది.
5 లక్షలకు పైగా లైకులతో వీడియో వైరల్
హైహీల్స్ వేసుకుని, చీరకట్టులో హిప్ హాప్ డ్యాన్స్ జెనీషా ఇరగదీయడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను నేపాల్ హిప్ హాప్ ఫౌండేషన్ ఇన్ స్టా పేజీ షేర్ చేసింది. 7 రోజుల క్రితం ఈ డ్యాన్స్ వీడియోను పోస్టు చేయగా.. ఇప్పటి వరకు 5.88 లక్షలకు పైగా లైకు వచ్చాయి. వేలాది మంది కామెంట్లు చేశారు.
హిప్ హాప్ డ్యాన్స్ అంటే ఏంటి?
హిప్ హాప్ సంగీతానికి లేదా హిప్ హాప్ సంస్కృతిలో భాగంగా అభివృద్ధి చెందిన స్ట్రీట్ డ్యాన్సే హిప్ హాప్. 1970 లో యునైటెడ్ స్టేట్స్ లో హిప్ హాప్ డ్యాన్స్ బాగా ప్రజాదరణ పొందింది. 1980ల్లో అమెరికన్ టీవీ షోలలో హిప్ హాప్ డ్యాన్స్ తో డ్యాన్సర్లు విశేషంగా ఆకట్టుకోవడంతో దీనికి మరింత ఆకర్షణ వచ్చింది. సాధారణంగా హిప్ హాప్ డ్యాన్స్ అనగానే బ్యాగీ ప్యాంట్ లు, బేస్ బాల్ క్యాపులు, స్వేట్ సూట్ లు ధరించి హిప్ హాప్ లుక్ లో డ్యాన్స్ చేస్తుంటారు. స్నీకర్లు ధరించి చేసే హిప్ హాప్ డ్యాన్సుల వీడియోలు ఇంటర్నెట్ లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. శరీరం పూర్తి సమన్వయంతో, సమతుల్యతతో, చురుకుగా చేసే డ్యాన్స్ ఇది.