Viral Video: చాలా ప్రమాదకర పరిస్థితుల్లో కొందరు పని చేస్తుంటారు. అలాంటి వారి భద్రత కూడా చాలా ముఖ్యం. అందుకే వారి కోసం కంపెనీ కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ప్రమాదాలు జరగకుండా చూస్తుంది. కొత్తగా పనిలో చేరిన వారంతా ఆ సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటారు. కానీ పనిలో నైపుణ్యత పెరిగిన కొద్దీ వాటిపై శ్రద్ధ తగ్గుతుంది. అందుకే ప్రమాదమని తెలిసినా లైట్ తీసుకుంటా ఉంటారు. ఇలాంటోళ్లు ప్రతి సంస్థలో ఒకరో ఇద్దరో ఉండే ఉంటారు.
అలాంటి వారిని హెచ్చరించేందుకు ఓ సంస్థ వినూత్న ప్రయోగం చేసింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో తరచుగా ఏవేవో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలానే ఈ విడియోను కూడా జనాలు షేర్లు చేస్తున్నారు. లైక్‌లు కొడుతున్నారు. కామెంట్స్‌తో రియాక్ట్ అవుతున్నారు. రేకుల షడ్ కింద ఎరుపు రంగు ఓ బాక్సు ఉంది. దాని పై "డు యూ నో హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సేఫ్టీ" అని రాసి ఉంది. అలాగే దాని కింద ఓపెన్ అండ్ సీ అని కూడా పసుపు పచ్చ రంగులో రాసి ఉంది. ఇన్ షర్ట్ వేసుకొని వేసుకొని మూతికి మాస్క్, తలపై క్యాప్ పెట్టుకొని వచ్చిన ఓ వ్యక్తి ఆ బాక్సును గమనించాడు. పైన "మీ భద్రతకు బాధ్యులు ఎవరో తెలుసా.. తెరిచి చూడండి" అని రాసి ఉన్నది చదివి ఆ బాక్సును తెరిచాడు. అందులో ఉన్నది చూసి ఒక్కసారిగా షాకై వెంటనే తేరుకొని నవ్వేస్తాడు. ఎందుకంటే అందులో ఉన్నది అద్దం. మీ భద్రతకు బాధ్యులు మీరే అని చెప్పేందుకే ఇలాంటి ఓ ఐడియా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.
ఆ కంపెనీలో పని చేసే కార్మికులకు హెచ్చరికగా ఈ బోర్డు పెట్టించారని తెలుస్తున్న సమాచారం. పనికి వెళ్లే ముందు ఓ సారి ఆ బోర్డును చూసుకొని అన్నీ సెక్యూరిటీ మెజర్స్ తీసుకున్నామో లేదో చూసుకొని వెళ్లి పనిలో సురక్షితంగా ఉండాలనే సూచన కోసం దీన్ని ఏర్పాటు చేశారట. అలా సిబ్బంది భద్రత కోసం పెట్టిన బోర్డు ఇప్పుడు నెటిజన్లు ఆకట్టుకుంటోంది.
Swatkat అనే ఓ నెటిజెన్ ఈ వీడియోను షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారింది. అలాగే ఇప్పటి వరకు ఈ వీడియోకు 97.4కే వ్యూస్ వచ్చాయి. వేలల్లో లైకులు, వందల్లో కామెంట్లు వచ్చాయి. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఐడియా అదిరింది గురూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వావ్ అమేజింగ్ థాట్, ఎ డీప్ మెసేజ్ ఫర్ ఎవ్రీవన్ అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన థాట్ ఎలా వచ్చింది బ్రో ఓ నెటిజెన్ రాసుకొచ్చాడు.