Viral News:


అంత కాస్ట్ పెట్టేంత ఏముంది ఇందులో..


ఆన్‌లైన్‌లోనే షాపింగ్ చేసుకునే వెసులుబాటు వచ్చాక, అందరూ దీనికి అలవాటు పడిపోయారు. సింపుల్‌గా ఇంట్లోనే కూర్చుని క్షణాల్లో నచ్చినవి ఆర్డర్ చేసుకుంటున్నారు. బయటతో పోల్చి చూస్తే ధరలు తక్కువగా ఉండటం, ఆఫర్లు ఎక్కువగా ఉండటం వల్ల అందరూ ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. అయితే...కొన్నిసార్లు ఈ ఆన్‌లైన్ రిటైల్ సంస్థలు కొన్ని ప్రొడక్ట్స్‌కి పెట్టే ప్రైస్‌ను చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. రోడ్డు మీద రూ.200లకు దొరికే సరుకులకూ వేలకు వేలు ధరలు పెట్టేస్తారు. వీటికి ఇంత కాస్ట్‌ ఏంటో అని ఆశ్చర్యపోతుంటారు. ఇప్పుడు అలాంటి సందర్భమే ఎదురైంది. అర్షద్ వాహిద్ అనే ట్విటర్ యూజర్ ఓ పోస్ట్ పెట్టాడు. కోబ్ (Kobe)బ్రాండ్‌కు చెందిన క్యాజువల్ షార్ట్‌ స్క్రీన్ షార్ట్ షేర్ చేశాడు. చూడటానికి సాధారణంగానే ఉన్నా, దాని కింద ధర చూస్తే కళ్లు తేలేయక తప్పదు. దీని ధరెంతో తెలుసా..? రూ.15 వేలు. నిజమే. పోనీ దానిపైన ఏమైనా డిజైన్ ఉందా అంటే అదీ లేదు. చాలా సాదీసీదా షార్ట్ అది. దానికే అంత కాస్ట్ పెట్టేసింది కంపెనీ. పైగా "Dad Trousers" అనే పేరుతో వీటిని విక్రయిస్తోంది. "ఈ ట్రౌజర్‌కి రూ.15 వేలు ఎందుకో" అని ఆ స్క్రీన్‌షాట్‌ని ట్విటర్‌లో పోస్ట్ చేశాడు అర్షద్ వాహిద్. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. "ఇంత కాస్ట్ పెట్టేంత ఏముందబ్బా ఇందులో" అని కామెంట్ చేస్తున్నారు. "ఇంత కాస్ట్ పెట్టారంటే, ఇది నేసిన వాళ్లకు ఎంత కమీషన్ ఇస్తున్నారో మరి" అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.