ఈ రోజుల్లో ఏ చిన్న విషయం జరిగినా సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోతుంది. నిత్యం ఫేస్‌ బుక్‌, ఇన్‌ స్టా గ్రామ్, వాట్సాప్ సహా ఇతర సోషల్ మీడియా మాద్యమాలలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. కొన్ని ఆసక్తికరంగా ఉంటే.. మరి కొన్ని కామెడీగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు భయకరంగా ఉంటాయి. మరికొన్నిటిని చూస్తే వామ్మో అనిపించేలా ఉంటాయి.


ప్రస్తుతం నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. అది ఏంటంటే..సామాన్యంగా మొసళ్లు అనేవి పెద్ద నదులలో, జలాశయాల్లో ఉంటాయి. కానీ ఈ వీడియోలో మాత్రం ఓ ఇంటి అడుగు భాగాన ఉన్నాయి. మొదటగా ఓ ఇంటి అడుగు భాగం నుంచి సగం భాగం పైకి సగం భాగం కిందకి ఉన్న ఒక మొసలిని ఆ ఇంటి వారు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.


వారు వచ్చి ఆ మొసలిని బంధించే క్రమంలో నేల అడుగు భాగం నుంచి మరో మొసలి ఒక్క ఊదుటున పైకి వచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారి గుండెలు అక్కడికక్కడే జారిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను @Figen అనే అకౌంట్ నుంచి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అయ్యింది. 


ఈ వీడియోను చూస్తే కనుక ఓ ఇంట్లో నేలకు పగుళ్లు కనిపించాయి. కాసేపటి తరువాత ఆ పగుళ్ల లోపల ఓ మొసలిని ఆ ఇంటి వారు గుర్తించారు. వెంటనే వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి వచ్చి ఆ మొసలిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. 


ఈ క్రమంలో మొసలి కొంచెం కొంచెం బయటకు వస్తుంది. ఇది పూర్తిగా వచ్చే క్రమంలో భూమి లోపల నుంచి మరో మొసలి కూడా బయటకు వచ్చింది. అలా ఒక్కసారిగా మరో మొసలి బయటకు వచ్చింది. దీంతో అక్కడున్న వారంతా భయంతో కంపించిపోయారు. ఒక మొసలి మాత్రం ఉంది అనుకున్న వారికి రెండవ మొసలి ఊహించని షాక్‌ ఇచ్చింది. 


రెండవ మొసలి అక్కడ ఉన్న వారిని మింగేయాలి అనేలా ఆ మొసలి బయటకు వచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారిలో కొంత మంది పక్కనే ఉన్న గోడ మీదకి దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. అటవీ అధికారులు రెండు మొసళ్లను పట్టుకుని వెళ్లిపోయారు. అయితే ఈ వీడియో ఎక్కడిది, ఎప్పటిది అనేది మాత్రం తెలియలేదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతుంది.