Minister KTR: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాలాపునర్వి హ్యాండ్లూమ్ పోచంపల్లిలో ఔత్సాహిక యువ చేనేత కళాకారుడు సాయిని భరత్ ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్ ను మంత్రి ప్రారంభించారు. చేనేతను కాపాడడంతోపాటు, నేతన్నలకు భారీగా ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో పెద్ద ఎత్తున చేనేత యూనిట్ ని ఏర్పాటు చేసిన భరత్ బృందానికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.


కాలాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్ ను ప్రారంబించారు. హ్యాండ్లూమ్ పార్కుకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. రూ.100 కోట్లతో చేపట్టనున్న దోభీఘాట్, సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్, సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బాలాజీ ఫంక్షన్ హాల్ లో జరగనున్న చేనేత వారోత్సవ సభలో ప్రసంగించారు. 






ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ అన్నింటినీ అమ్మేస్తూ.. చేనేతలను ఇబ్బంది పెడుతుంటే.. తెలంగాణ సర్కారు మాత్రం దివాలా తీసిన పోచంపల్లి చేనేత పార్కును కొనుగోలు చేసిందన్నారు. పోచంపల్లి చేనేత పార్కుని పునరుద్ధరించి ఇక్కడి నేతన్నలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తమిళనాడులోని తిరుపూర్ టెక్స్ టైల్ క్లస్టర్ మాదిరి పోచంపల్లి నేతన్నలు కలిసి పోచంపల్లి చేనేతల అభివృద్ధి కోసం సమష్టిగా పని చేయాలని సూచించారు. 


నిన్న తొలి అగ్రికల్చర్ డేటా ఎక్సేంజ్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ 
వ్యవసాయరంగంలో దేశంలోనే తెలంగాణ  అగ్రగామిగా ఉన్నదని మంత్రి కేటీఆర్‌  అన్నారు. దేశానికే అన్నం పెట్టేంతగా ధాన్యం పండిస్తున్నామని చెప్పారు. రైతులకు బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తమదన్నారు. వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదని వెల్లడించారు. హైదరాబాద్‌ శంషాబాద్‌లోని నోవాటెల్‌లో దేశంలోనే తొలి అగ్రికల్చర్‌ డేటా ఎక్సేంజ్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు  ఒక రైతు కాబట్టి వ్యవసాయంపై అవగాహన ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని అతి తక్కువ సమయంలో నిర్మించామని చెప్పారు.  


గతంలో పాలమూరు నుంచి వలసలు ఉండేవని, ఇప్పుడు వలసలు లేవని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. రైతులకు ఉచితంగా 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు. దేశంలో నాణ్యమైన పత్తి తెలంగాణ నుంచి వస్తున్నదని చెప్పారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించామనన్నారు.  దేశంలో నాణ్యమైన పత్తి తెలంగాణ నుంచి వస్తున్నదని చెప్పారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించామనన్నారు. రైతు ఆదాయం కూడా గ‌ణ‌నీయంగా పెరిగింద‌న్నారు.. ఉమ్మ‌డి పాల‌న‌లో క‌నీసం ఏడాదికి ఒక పంట వేసుకోలేని దుస్థితి నుంచి కెసిఆర్ పాల‌న‌లో మూడు పంట‌లు వేసే స్థాయికి ఎదిగామ‌ని చెప్పారు కేటీఆర్.