Car Fire Accident in Jaipur | జైపూర్: డ్రైవర్ లేకుండా వెళ్తున్న ఓ కారులో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన వాహనంలో ఎవరైనా ఉన్నారా అని చూసిన వారు షాకయ్యారు. ఆ కారులో మంటలతో ఫ్లై ఓవర్ మీదకు వెళ్లడాన్ని చూసిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని అజ్మీర్ రోడ్‌లోని ఎలివేటెడ్ రోడ్డులో ఈ ఘటన జరిగింది.


అసలేం జరిగింది..


అజ్మీర్ రోడ్‌లోని సోడాలా సబ్జీ మండి నుంచి సుదర్శన్‌పురా పులియా వైపు ఓ కారు వెళ్తోంది. ఒక్కసారిగా ఆ కారులో మంటలో వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ జితేంద్ర ప్రాణాలు కాపాడుకునేందుకు ఎస్‌యూవీ నుంచి కిందకి దూకేశాడు. అనంతరం డ్రైవర్ లేకుండా ఆ కారు ఫ్లైఓవర్ నుంచి మంటలతోనే దూసుకెళ్లింది. కారులో ఉన్న వారిని కాపాడేందుకు దాని దగ్గరకు వెళ్లిన తోటి వాహనదారులు, స్థానికులు అందులో డ్రైవర్ లేకపోవడంతో ఆశ్చర్చపోయారు. అలా కొంతదూరం వెళ్లిన కారు ఓ టూవీలర్ ను ఢీకొట్టి ఆగిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఆ మార్గంలో ఎక్కువగా వాహనాలు వెళ్లకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. 






షార్ట్ సర్క్యూట్ కావడంతో కారులో పొగలు వచ్చినట్లు గుర్తించి కిందకి దూకినట్లు జితేంద్ర తెలిపాడు. కానీ నిమిషాల వ్యవధిలో మంటల్లో కారు కాలిపోయిందని, ఎందుకిలా జరిగిందో అర్థం కావడం లేదన్నాడు. కారు చివరగా పార్కింగ్ చేసిన ఓ వాహనాన్ని ఢీకొని, అనంతరం డివైడర్ ను ఢొకొట్టి ఆగిపోయినట్లు తెలిపాడు. కారులో ఉన్న వ్యక్తి ముందుగానే అందులోంచి దూకాడని తెలిసి స్థానికులు ఆశ్చర్యపోయారు. జితేంద్ర మానససరోవరం లోని జర్నలిస్ట్ కాలనీలోని దివ్య దర్శన్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు.


Also Read: World War III : మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?