Dress Colour Illusion: సోషల్ మీడియా వచ్చాక ఏది ఎందుకు వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. వీడియోలు, ఫోటోలు, డ్యాన్స్ లు తెగ వైరల్ అవుతుంటాయి. వాటిని సోషల్ మీడియా యూజర్లు అందరూ ఫాలో అవుతుంటారు. ఒకరిని చూసి ఒకరు ట్రెండ్ ను ఫాలో అవుతూ మరింతగా వైరల్ చేస్తుంటారు. అలా వైరల్ అయింది ఓ డ్రెస్. ఆ డ్రెస్సుకు సంబంధించిన కొన్ని పిక్స్ అలా సోషల్ మీడియాలో పెట్టగానే వైరల్ గా మారిపోయింది ఆ పోస్టు. అంతగా ఆ డ్రెస్సులో ఏముంది అనేగా మీ డౌట్. ఆ డ్రెస్సులో చాలానే మ్యాటర్ ఉంది. అదేంటంటే.. కలర్ ఇల్యూషన్. అంటే.. ఈ డ్రెస్ కొందరికి నీలం- నలుపులో కనిపిస్తుంది. మరికొందరికి ఈ డ్రెస్ తెలుపు- బంగారం రంగుల్లో కనిపిస్తుంది. ఆ ప్రత్యేకత వల్లే ఈ డ్రెస్ పోస్టు వైరల్ గా మారింది. అయితే ఈ వైరల్ అయిన న్యూస్ ఇప్పటిది కాదు లేండి. 


ఓ మహిళ తన కూతురి కోసం ఈ డ్రెస్ కొనుగోలు చేసింది


స్కాట్లాండ్ లో ఓ యువతి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. పెళ్లి రోజు కానుకగా తన తల్లి ఓ డ్రెస్ కొనుగోలు చేసి దానిని తన కూతురికి బహుమతిగా ఇవ్వాలనుకుంది. ఆ డ్రెస్ ఖరీదు దాదాపు 5 వేల రూపాయలు.  ఆ డ్రెస్ ను ఫోటో తీసి.. ఇదే పెళ్లి సందర్భంగా నేను నీకిచ్చే గిఫ్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఆ డ్రెస్ ఫోటోను కూతురికి పంపింది. ఆ ఫోటోను చూసిన కూతురికి కోపం కట్టలు తెంచుకుంది. 


డ్రెస్ ను చూసి కోపం తెచ్చుకున్న వధువు


తన తల్లి నుంచి వచ్చిన ఆ డ్రెస్ ఫోటోను చూసిన వధువు కోపం తెచ్చుకుంది. తెలుపు- బంగారు రంగుల్లో ఆ డ్రెస్ వధువుకు కనిపించింది. ఆ రంగుల కాంబినేషన్ తనకు కోపం తెప్పించింది. తెలుపు- బంగారు రంగుల్లో ఉన్న డ్రెస్ ఎందుకు కొన్నావంటూ ఆ వధువు తన తల్లిపై కోపాన్ని ప్రదర్శించింది. తాను కొన్నది నీలం, నలుపు రంగులో ఉన్న డ్రెస్ అని దానినే ఫోటో తీసి నీకు పంపానని ఆ తల్లి కూతురికి చెప్పింది. పెళ్లి కూతురు ఆ కలర్ మ్యాజిక్ ను నమ్మలేక ఆ ఫోటోను కాస్త సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ డ్రెస్ ఏ కలర్ లో ఉందో కాస్త చెప్పండి అంటూ సోషల్ మీడియా యూజర్లను అడిగింది. తన ప్రశ్నకు కొందరు తెలుపు- బంగారం రంగులు అని మరికొందరేమో నీలం- నలుపు రంగులు అని సమాధానాలిచ్చారు. కామెంట్లు చూసి ఆ వధువు ఆశ్చర్యపోయింది.


ఇంతకీ ఆ డ్రెస్సుల రంగు ఏంటి?


అసలు ఆ డ్రెస్సు రంగు నీలం, నలుపు కాంబినేషన్. అయితే ఆప్టికల్ ఇల్యూషన్ కారణంగా ఈ డ్రెస్ కొంత మందికి ఒకలా, ఇంకొంత మందికి ఇంకోలా కనిపిస్తుంది. అందుకే కొందరికి నలుపు- నీలం రంగులో, మరికొందరికి తెలుపు- బంగారం రంగులో కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు.