Naga Babu: దర్శకుడు ఓర్ రౌత్ దర్శకత్వంలో రాముడి పాత్రలో ప్రభాస్, కృతి సనన్ సీత పాత్రలో రామాయణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా జూన్ 16 న దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల అయి సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. తాజాగా ‘ఆదిపురుష్’ సినిమా గురించి సినీ నటుడు నాగబాబు ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం యువతకు రామాయణం గురించి అంతగా తెలీదని, కచ్చితంగా రామాయణం గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగబాబు మాటలు వైరల్ అవుతున్నాయి. 


రామాయణం గురించి యువత తెలుసుకోవాలి..


‘ఆదిపురుష్’ విడుదల సందర్భంగా సినీ నటుడు నాగబాబు ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో రామాయణం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను కూడా ‘ఆదిపురుష్’ సినిమా ట్రైలర్ ను చూశానని, చాలా బాగుందని అన్నారు. తప్పకుండా సినిమా చూస్తానని చెప్పారు. ఒక నిజమైన మనిషి ఎలా ఉండాలో నిరూపించిన వ్యక్తి శ్రీరాముడేనని అన్నారు. రామాయణం, మహాభారతం లాంటి అద్భుతమైన గ్రంథాలు ప్రపంచంలో ఎక్కడా ఉండవని అన్నారు. మహాభారంతం జరిగి ఉంటే అద్భుతం జరగకపోతే మహాద్భుతం అని ఎవరో అన్నట్టు రామాయణం కూడా అలాంటి మహా గ్రంథమేనని అన్నారు. సమాజంలో ఒక మనిషి ఎలా నడుచుకోవాలి అనేది రాముడు చెప్తే ధర్మంగా ఎలా బతకాలో శ్రీకృష్ణుడు చెప్పాడని చెప్పుకొచ్చారు నాగబాబు. అందుకే యువత రామాయణ, మహాభారతాల గురించి తెలుసుకోవాలని పేర్కొన్నారు. 


నాకెంతో ఇష్టమైన పాత్ర శ్రీరాముడు: నాగబాబు


రామాయణం ఆధారంగా సినిమా వస్తుంది అంటే హీరో ప్రభాస్ అనో లేదా వేరే వాళ్లనో మాటలు చెప్పడం లేదనన్నారు నాగబాబు. ఎవరి కోసమో ఈ మాటలు చెప్పడం లేదని, మన హిందూ దేశంలో రామాయణం అనే గొప్ప గ్రంథం ఉందని తెలుసుకోవడం కోసం ఈ సినిమాను అందరూ చూడాలని అన్నారు. అన్నిటికంటే తనకు రాముడి పాత్ర అంటేనే ఇష్టమని చెప్పారు నాగబాబు. రాముడిలా ఒక్క క్షణం అయినా మనం బతగలమా అని అప్పడప్పుడూ అనిపిస్తుందని అన్నారు. రాముడు గొప్ప యోధుడు, గొప్ప రాజు, గొప్ప కొడుకు, గొప్ప అన్న, గొప్ప భర్త అన్నిటికంటే గొప్ప మనిషి అని చెప్పారు. తానెప్పుడూ ఏ సినిమా గురించి కూడా చెప్పనని, కానీ ఈ ‘ఆదిపురుష్’ పేరుతో వచ్చిన రామాయణం సినిమాను కచ్చితంగా చూడాలి అని అన్నారు. ఇది హిందువులకు గౌరవప్రదమైన గొప్ప కథ, గాథ అని చెప్పుకొచ్చారు నాగబాబు. 


గ్రాండ్ గా ‘ఆదిపురుష్’ రిలీజ్..


‘ఆదిపురుష్’ సినిమా దేశవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాను దేశవ్యాప్తంగా 6,200 లకు పైగా స్క్రీన్ లలో విడుదల చేశారు. ఇప్పటికే మూవీ విడుదల అయి సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. అడ్వాన్స్ బుకింగ్ లు కూడా భారీ గానే జరిగాయి. మరి మూవీ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రాముడి పాత్రలో ప్రభాస్ చేయగా సీత పాత్రలో కృతి సనన్ నటించింది. రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. భూషణ్ కుమార్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. 


Read Also: 18 ఏళ్ల ‘నో కిస్’ రూల్‌ను బ్రేక్ చేసిన తమన్నా - ఈ నిర్ణయం అతడి కోసమేనట!