Viral Antarctic Video : మనుషుల కంటే జంతువులే చాలా బెటర్ అని మనకు చాలా సందర్భాల్లో అనిపిస్తుంది కదా. అందుకు ఎగ్జాంపుల్ గా అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరలై, మిలియన్ల వ్యూస్ ను పొందాయి. ఇటీవల నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురొచ్చిన ఏనుగు చూసిన భయపడిన ఓ వ్యక్తి.. అది తనను ఎక్కడ దాడి చేస్తుందోనని భయపడ్డాడు. కానీ ఏనుగు మాత్రం అతన్ని ఏమీ అనకుండా అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఇలా జంతువులు, మనుషులతో సంభాషించే అనేక దృశ్యాలు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం. అదే తరహాలో ఓ పెంగ్విన్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తన దారిలో అడ్డుగా నిలబడ్డ జంట వెళ్లే వరకు ఆ పెంగ్విన్ ఓపిగ్గా ఎదురుచూడడం అందర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది.


కొన్నిసార్లు మన వెళ్తున్న దారిలో వేరే వాళ్లు వెళ్తూ ఆలస్యం చేస్తే మనకు ఎక్కడాలేని కోపం వచ్చేస్తుంటుంది. ఆ కోపంలో కొన్నిసార్లు ఏవేవో మాటలు కూడా అనేస్తాం. అవతలి వాళ్లు నెమ్మదస్తులైతే పర్లేదు. కానీ వాళ్లూ కోపం తెచ్చుకుంటే పరిస్థితి తారుమారవుతుంది. అయితే సహజంగానే దూకుడు ఎక్కువగా ఉండే జంతువులు మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో సున్నితంగా వ్యవహరిస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా.





 రీసెంట్ గా ఓ జంట అంటార్కిటికాలో పర్యటిస్తూ.. అక్కడి ప్రకృతి అందాలను వీక్షిస్తూ మైమరిచిపోయింది. వీళ్లు వెళ్తున్న దారిలోనే ఓ పెంగ్విన్ ఉంది. ఆ జంట దాని దారికి అడ్డంగా ఉన్నప్పటికీ చూట్టూ చూస్తూ మైమరిచిపోయింది. ఆ జంట కూడా తమ వెనక అదే రోడ్డులో వస్తున్న పెంగ్విన్‌ను గమనించలేదు. ఈలోపు పెంగ్విన్ వారిని సమీపించింది. అలా వారు కదిలేవరకూ అక్కడే ఉండిపోయింది. కోపం తెచ్చుకోవడం గానీ, వారిపై అరవడం గానీ, మరో మార్గంలో వెళ్లడం గానీ చేయకుండా ఆ పెంగ్విన్ ఎదురుచూడడం ఎంతో క్యూట్ గా అనిపిస్తుంది.


ఈ సన్నివేశాన్నంతటినీ రికార్డ్ చేస్తున్న ఓ వ్యక్తి పెంగ్విన్ ను గమనించి ఆ జంటను అప్రమత్తం చేశారు. దీంతో, వారు పెంగ్విన్ చూసి మురిసిపోయి దానికి దారి ఇచ్చారు. వారు పక్కకు తప్పుకోగానే పెంగ్విన్ సైలెంట్ గా నడుచుకుంటూ వెళ్లిపోయింది. తనకు అడ్డుగా ఉన్నా వారికి ఎలాంటి హానీ చేయకుండా, అరవకుండా ఉండడం ఎంతో మంది ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 125 మిలియన్లకు పైగా వ్యూస్, మిలియన్ కంటే ఎక్కువ లైక్స్ వచ్చింది. ఇది సోషల్ మీడియాలో షేర్ కాగానే.. ఇంకేముంది నెటిజన్లు కామెంట్స్ చేయడం ప్రారంభించారు. ముచ్చటగా ఉందన్నారు. దీనికి మొహమాటం ఎక్కువేమోనని మరికొందరు అన్నారు. ఈ పెంగ్విన్ కు తెలిసినంత మర్యాద కూడా మనుషులకు తెలియదని కొందరు కామెంట్ చేశారు.


Also Read  : Viral News: బాలికకు పాము కాటు, ఏది కరిచిందో తెలియక రెండు పాములను చంపి ఆసుపత్రికి!