ఈ మధ్య కాలంలో చిన్న చిన్న పనులే వైరల్‌గా మారుతున్నాయి. చిన్నారి బోసినవ్వు కురిపించినా... వధువు పెళ్లిమండలంలో లేటెస్ట్ పాటకు డ్యాన్స్ చేసినా ఇలా ఈవెంట్ ఏదైనా సరే నెటిజన్లు తెగ షేర్లు కొట్టస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ వీడియో ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తోంది.
విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు... అక్కడి సెక్యూరిటీ స్టాఫ్‌తో ఆడిన చిన్న గేమ్ నెట్‌లో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
విమానంలో కూర్చున్న ఆ ప్రయాణికుడు విమానం కిటికీలోంచి సెక్యూరిటీ గార్డ్‌తో ఈ చిన్న పిల్లల గేమ్ ఆడారు. రాక్ పేపర్ సిజర్ గేమ్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇది 2019 జరిగినప్పటికీ ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. దీన్ని బ్రీ అనే యువతి తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.
న్యూజెర్సీలోని అట్లాంటిక్ సిటీలో జరిగిందీ సంఘటన. ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌ను ట్రాన్స్‌పొర్ట్ేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా షేర్ చేసింది. బ్రి ప్రియుడు TSA గ్రౌండ్ స్టాఫ్‌తో కలిసి విమానం కిటికీలోంచి రాక్, పేపర్, సిజర్ ఆడుతున్నట్లు వీడియోలో ఉంది. విమానంలో ఉన్న వ్యక్తి సిజర్ సిగ్నల్ చూపిస్తే... టీఎస్‌ఏ సిబ్బంది రాక్ సింబల్ చూపిస్తాడు. అంతే అతను గెలిచినట్టు సంబరపడతాడు. అదే ఆనందంకతో ప్రయాణికుడికి బైబై చెప్తాడు. 4 అంగుళాల కంటే పెద్ద కత్తెరను ప్యాక్ చేయలేరని ప్రజలకు చెప్పడానికి టీఎస్‌ఏ ఈ వీడియోను ఉపయోగించుకుంటోంది.
సోషల్ మీడియాలో పెట్టిన ఈ రీల్‌కి 52 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 4.7 మిలియన్ లైక్‌లు వచ్చాయి.