Monkeys using phone: ప్రస్తుత కాలంలో స్మార్ట్ లేని వాళ్లుండరు అంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ల వరకు ప్రతీ ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడేస్తున్నారు. అంతేనా రీల్స్, వీడియోలు వంటివి చేస్తూ తమ టాలెంట్ ను ప్రూవ్ చేస్కుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని వాటిని వీడియోలుగా మలుస్తున్నారు. పాటలు పాడుతూ, జోకులు చెప్తూ, మిమిక్రీ చేస్తూ, వంటలు, డ్యాన్సులు, వ్లాగ్ లు... ఇలా సవాలక్ష వీడియోలను నెట్టింట్లో పెట్టేస్తున్నారు. ఇక వాటిని చూసేందుకు జనాలు కూడా ఎగబడిపోతున్నారు. 


ముచ్చటగా మూడు కోతులు.. ముద్దుగా ఫోన్ వాడేస్తున్నాయి..


చిన్న పిల్లలు అయితే స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టి ఏ పాటలో, బొమ్మలో పెడితే తప్ప అన్నం తినడం లేదు. అంతేనా ఫోన్ ఇచ్చే వరకు ఒటే ఏడుపు. ఇక పెద్ద వాళ్లు ఎక్కడున్నా.. రోడ్డుపై నడుస్తున్నా ఫోన్ వైపే చూస్తూ అడుగులు వేస్తున్నారు. ఇక మేం కూడా మీకు ఏమాత్రం తీసిపోమనుకుంటూ ముందుకొచ్చాయి మూడు వానరాలు. ముచ్చటగా ఈ మూడు కోతులు ఒక్కచోట చేరి స్మార్ట్ ఫోన్ ను వాడేస్తున్నాయి. అంతేనా అందులో వాటికి నచ్చిన వీడియోలు చూస్తూ... తెగ స్క్రీన్ ను తెగ స్క్రోల్ చేసేస్తున్నాయి. అయితే వీటికి ఫోన్ ఇచ్చింది మాత్రం ఓ మనిషేనండోయ్. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. 






కోతులకు ఫోన్ చూపిస్తున్న ఆ మహానుభావుడు ఎవరో కానీ... ముద్దుగా ఉన్న ఆ కోతులు ఫోన్ చూస్తుంటే మాత్రం చాలా ముచ్చటగా కనిపిస్తోంది. అయితే ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. మనుషులకంటే కూడా చాలా బాగా ఫోన్ వాడుతున్నాయంటూ చెప్తున్నారు. ఫోన్ ఇచ్చిన వాడి ధైర్యానికి మెచ్చుకోవాలని కొందరు.. మా వంతు అయిపోయింది.. ఫోన్ వాడకం ఇక మీ వంతా అంటూ మరి కొందరు తెగ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాదండోయ్ క్రేజ్ ఆఫ్ సోషల్ మీడియా అనే హ్యాష్ టాగ్ తో తెగ వైరల్ చేసేస్తున్నారు. ఇప్పుడు కేవలం వీడియోలు మాత్రమే చూస్తున్న ఈ కోతులు త్వరలోనే యూట్యూబ్ ఛానెళ్లు, తమకంటూ ప్రత్యేక అకౌంట్లు కూడా క్రియేట్ చేస్కునేలా కనిపిస్తోంది. వివిధ రకాల ఫోజులు పెడ్తూ సెల్ఫీలు దిగి నెట్టింటిని షేక్ చేసేలా ఉన్నాయి. 


ఇన్నాళ్లు మనుషులు చేసే అరాచకాన్ని చూసే తట్టుకోలేక పోయాం. ఇక కోతులు కూడా స్మార్ట్ ఫోన్లు వాడి.. సోషల్ మీడియాలో అకౌంట్లు క్రియేట్ చేస్కుంటే మామూలుగా ఉండదు. అయితే ఇది ఊహించుకోవడానికి కొంచెం కష్టం అనిపించినప్పటికీ... భవిష్యత్తులో జరిగినా మనమేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషఇ ఏర్పడిందే కోతి జాతి నుంచి కాబట్టి. రాబోయే కాలంలో వాటికి కూడా మెదడు పెరిగి ఏం చేస్తున్నాయో తెలిస్తే.. ఇక సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తాయి. ఏది ఏమైనప్పటికీ వానరాలు ఫోన్ వాడటాన్ని చూస్తుంటే మాత్రం చాలా ముచ్చటగా ఉంది. మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి.