డైమండ్‌ను చూస్తేనే కళ్లు జిగేల్ మంటాయి. అలాంటిది బ్లాక్ డైమండ్‌ను చూస్తే? అవును ప్రపంచంలోనే అత్యంత అరుదైన నల్ల వజ్రాన్ని ఇటీవల ప్రముఖ వేలం కంపెనీ సోథెబీ.. దుబాయ్‌లోని తమ కార్యాలయంలో మీడియాకు చూపించింది. దీని విశేషాలు వింటే షాక్ అవ్వాల్సిందే.
- 'ది ఎనిగ్మా'గా పిలిచే ఈ బ్లాక్ డైమండ్ 555.55 క్యారెట్లు ఉన్నట్లు వేలం సంస్థ తెలిపింది.
- భూమిపై ఇప్పటి వరకు గుర్తించిన వజ్రాలలో అత్యంత అరుదైనది ఈ బ్లాక్ డైమండ్.
- 260 కోట్ల సంవత్సరాలకు ముందు భూమిని ఓ గ్రహశకలం లేదా ఉల్క ఢీకొనడంతో ఈ వజ్రం పుట్టింది అని నమ్ముతున్నారు.
- ఈ వజ్రంపై నిర్వహించిన కార్బన్ పరీక్షల ఆధారంగా దీని పుట్టు పూర్వోత్తరాలు గుర్తించారు.
- ఈ బ్లాక్ డైమండ్‌లో 55 ముఖాలు గుర్తించినట్లు సోఫీ స్టీవెన్స్ అనే వజ్రాల స్పెషలిస్ట్ తెలిపారు.
- ఇప్పటివరకు ప్రపంచంలోని కట్ డైమండ్లలో ఇదే అతి పెద్దదిగా భావిస్తున్నారు.
సోథెబీ సంస్థకు చెందిన వివిధ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచిన అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో వజ్రాన్ని లండన్‌లో వేలం వేయనున్నారు. $ 6.8 మిలియన్ల అమెరికన్ డాల్లర్లు వరకు ఈ వజ్రం ధర పలికే అవకాశం ఉన్నట్లు 'సోథెబీ' ప్రతినిధి తెలిపారు.
ఓనర్ ఎవరు?
ఈ వజ్రం 20 ఏళ్లకు ముందు బయటపడింది. కానీ దీన్ని పొందిన ఓనర్ ఈ బ్లాక్ డైమండ్‌ను ఎవరికీ చూపించలేదు. ఇప్పుడు కూడా ఓనర్ ఎవరన్నది రహస్యంగానే ఉంచారు.
1990లో ఈ వజ్రాన్ని ఓ మామూలు రాయి అనుకుని అతను తీసుకున్నారు. తర్వాద దాన్ని నిపుణులు కట్ చేసి 55 ముఖాలు ఉండేలా చేశారు. ఆ తర్వాత దీన్ని ప్రజలకు చూపించారు.
నమ్మకం..
మధ్య ఆసియాలో ఉండే హంస అనే గుర్తును ప్రేరణగా తీసుకొని ఈ వజ్రాన్ని కట్ చేశారు. శక్తి, రక్షణకు సంబంధించిన సింబలే ఈ హంస. ఇది అరచెయ్యి ఆకారంలో ఉంటుంది. అందుకే దీన్ని శుభానికి గుర్తుగా భావిస్తారు.
Also Read: Abu Dhabi New Travel Rules: ఇక అబుదాబిలో అడుగుపెట్టాలంటే వీసాతో పాటు ఇది కూడా కావాలి!