రాంగ్ రూట్లో వచ్చినా, ఎక్కువ మందిని ఎక్కించుకుని వాహనాలు నడిపినా, హెల్మెట్ పెట్టుకోకపోయినా, సరైన పత్రాలు లేకపోయినా ట్రాఫిక్ పోలీసులు చలనా వేయడం సహజంగా చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం వాహనంలో సరిపడినంత ఆయిల్ లేదని చలనా వేశారు. అవునండీ మీరు విన్నది నిజమే. ఒక వ్యక్తి తన వెహికల్ లో సరిపడినంత ఆయిల్ లేకుండా ప్రయాణం చేస్తున్నాడని చాలా వేశారు. అది చూసి అవాక్కవడం అతని వంతైంది. దీనికి సంబంధించిన చలనా ఇప్పుడు సామాజిక మధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇదెక్కడి చోద్యం రా బాబూ అని నవ్వుకుంటున్నారు.


కేరళ కి చెందిన బసిల్ శ్యాం అనే వ్యక్తి రోజు మాదిరిగానే తన రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 వాహనంపై తన ఆఫీసుకి బయల్దేరాడు. వన్ వే రోడ్డు మీద వ్యతిరేక దిశలో వెళ్తున్నాడని ట్రాఫిక్ పోలీసులు అతని బండి ఆపేశారు. రూ.250 చలనా వేసి కట్టేయమన్నారు. అతను కూడా చలనా కట్టేశాడు. ఆఫీసుకి వచ్చిన తర్వాత చలనాలో రాసిన రీజన్ చూసి నోరెళ్ళబెట్టాడు. అందులో వాహనంలో సరిపడినంత ఆయిల్ లేదనే కారణంతో చలనా వేసినట్టు ఉంది. ఇంకేముంది అది చూసి ఆశ్చర్యపోవడం అతని వంతైంది.


తక్కువ ఆయిల్‌తో బండి నడపకూడదని ఎక్కడా రూల్స్ లేవని కొందరు అంటున్నారు. కానీ కేరళ రవాణా చట్టం ప్రకారం ప్రయాణికులని తీసుకువెళ్ళే  కారు, బస్, ఆటో వంటి వాహనాల్లో సరిపడినంత ఇంధనం లేకపోతే ఆ డ్రైవరు లేదా యజమానికి రూ.250 జరిమానా విధిస్తారు. అలా అతనికి కూడా ట్రాఫిక్ పోలీసులు చలనా వేశారన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా కేరళ వెళ్తే మీ వాహనంలో సరిపడినంత ఇంధనం ఉందో లేదో చూసుకోండి లేదంటే మీకు కూడా చలానా తప్పదండోయ్. 


గతేడాది గుజరాత్ కి చెందిన ఓ వ్యక్తి సైకిల్ మీద స్పీడ్ గా ప్రమాదకరంగా వెళ్తున్నాడని పోలీసులు ఆపి చలనా వేశారు. హైవే మీద రాంగ్ సైడ్ లో ప్రమాదకరంగా సైకిల్ తొక్కుతున్నాడని గుజరాత్ పోలీసులు జరిమానా విధించారు. గుజరాత్ పోలీస్ యాక్ట్ ప్రకారం అక్కడ అలా వెళ్ళడం నేరం.  


Also Read: KA Paul Kakinada : కేఏ పాల్ కార్లతో అనుచరుడు జంప్ - చివరికి ఏమయిందంటే ?


Also Read: స్టూడెంట్‌తో మర్దన చేయించుకున్న టీచర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్