మోమోసా, షూసా..? 


బట్టలు, షూస్ డిజైనింగ్ చేయటం అంత సులువేమీ కాదు. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కంపెనీలు డిజైన్‌లలో మార్పులు
చేర్పులు చేస్తూ కస్టమర్స్‌ని ఆకట్టుకునేందుకు కిందామీదా పడుతుంటాయి. ఈ క్రమంలోనే కొన్ని వెరైటీ డిజైన్లు పుట్టుకొస్తుంటాయి. అవి మిస్‌ఫైర్ అవ్వటమే కాకుండా, బ్రాండ్ ఇమేజ్‌నీ దెబ్బ తీస్తాయి. ఇంకొన్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి చర్చే జరుగుతోంది. ఈజీ బ్రాండ్‌కు చెందిన షూ డిజైన్‌ను విడుదల చేసింది ఆ సంస్థ. ట్విటర్‌లో ఆ డిజైన్‌ ఫోటోలనూ షేర్ చేసింది. అక్కడి వరకూ బాగానే ఉంది. ఎప్పుడైతే ర్యాపర్ కాన్యే వెస్ట్‌ ఈ ఫోటోను షేర్ చేశాడో అప్పటి నుంచి ఈ పేరు మారుమోగిపోతోంది. ఇదేం డిజైన్‌రా నాయనా అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఫన్నీ ట్వీట్‌లు చేసే కాన్యే వెస్ట్‌, ఈ సారి 
కూడా అదే తరహాలో "నా షూస్ ఎలా  ఉన్నాయో చెప్పండి" అంటూ ట్వీట్ చేశాడు. ఈ డిజైన్ చూసిన నెటిజన్లు ఆ కంపెనీని ఓ ఆటాడుకుంటున్నారు. కొందరు సాసేజ్ రోల్స్ అని అంటుంటే, ఇంకొందరు మోమోస్‌తో పోల్చుతున్నారు. "బేకింగ్ ఎక్స్‌పెరిమెంట్ ఫెయిల్ అయిందేమో" అని ఇంకొందరు రిప్లై ఇస్తున్నారు.