Internet Apocalypse : సూర్యుడు ఇప్పుడు మండిపోతున్నాడు. ఇంకా బాగా మండిపోతాడు. ఇంకో రెండేళ్లలో సూర్యుడి నుంచి వచ్చే అతిపెద్ద తుపానులకు ప్రపంచంలో ఉన్న మొత్తం ఇంటర్నెట్ వ్యవస్థ అంతా కుప్పకూలిపోతుంది అని గత రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒకటే చర్చ. నేషనల్, ఇంటర్నేషనల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కథనాల మీద కథనాలను ప్రచురించాయి. ప్రజలంతా ఏంటీ రెండేళ్లలో ఇంత పెద్ద ఉపద్రవం పొంచి ఉందా. ఇక ఇంటర్నేట్ ఉండదంటే మన ఫేస్ బుక్ లు, మన వాట్సాప్ లు, మన ఇన్ స్టా లు ఎలా తెగ భయపడిపోతున్నారు. అసలింతకీ ఏంటీ వార్త. ఇంటర్నెట్ అపోకలిప్స్ గా పిలుస్తున్న ఈ భారీ ఉపద్రవం నిజంగా భూమిని దాని సమర్థమైన సాంకేతిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయనుందా.. ఈ వార్తల వెనుక దాగి ఉన్న వాస్తవం ఏంటీ.. అపోహలు ఏంటీ.. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.


కలకలం రేపిన వాషింగ్టన్ పోస్ట్
వాషింగ్టన్ పోస్ట్ మూడు వారాల క్రితం తొలిసారిగా ఇంటర్నెట్ అపోకలిప్స్ పై కథనాన్ని ప్రచురించింది. సంగీతా అబ్దూ జ్యోతి అనే ప్రొఫెసర్ సబ్మిట్ చేసిన సైంటిఫిక్ పేపర్ ఆధారంగా ఈ కథనాన్ని ప్రచురిస్తున్నట్లు చెప్పింది వాషింగ్టన్ పోస్ట్. ఈ కథనం ప్రకారం 2025 తర్వాత భూమి మీద ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. దీనికి కారణం సూర్యుడు తన సోలార్ మ్యాగ్జిమం కు చేరుకుంటాడు. ఫలితంగా వెలువడే సూర్యుడి కొరోనా నుంచి వెలువడే అతి శక్తివంతమైన సౌర తుపానుల ధాటికి భూమి మీద సాంకేతిక వ్యవస్థ అంతా దెబ్బతింటుంది. దాని రిజల్టే భూమిపై ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. దీన్నే ఇంటర్నెట్ అపోకలిప్స్ అని వార్త ప్రచురించింది. అపోకలిప్స్ అంటే గ్రేట్ డిస్ట్రక్షన్ అని అర్థం. అతిపెద్ద విధ్వంసం అన్నమాట.






వాస్తవం ఏంటంటే..
ఇప్పుడు ఈ వార్తలో నిజానిజాలు ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. సూర్యుడు తన మ్యాగ్జిమంకు చేరుకుంటాడనే మాట వాస్తవం. అయితే సోలార్ మ్యాగ్జిమం అనేది ఏదో 2025లో మాత్రమే జరిగేది కాదు. ప్రతీ 12 సంవత్సరాలకు ఓ సారి సూర్యుడు తన ఉచ్ఛస్థితికి చేరుకుంటూ ఉంటాడు. దీన్నే సోలార్ మ్యాగ్జిమం అంటారు. అంటే సూర్యుడు సాధారణ ఉష్ణోగ్రతల కంటే కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఆ టైమ్ లోనే సూర్యుడి బ్లాక్ స్పాట్స్ అవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తాయి కూడా. సూర్యూడి సోలార్ ఫ్లేర్స్ అంటారు సౌర తుపానులు వస్తాయన్న మాట. ఈ మ్యాప్ చూడండి 1985 నుంచి 2020 మధ్యలో సోలార్ మ్యాగ్జిమమ్ ఏర్పడిన గ్రాఫ్ ఇది. ప్రతీసారి సూర్యుడి ఉచ్ఛస్థితి అంటే హై టెంపరేచర్సే ఉంటాయనేం రూల్ లేదు.






12 సంవత్సరాలకే సోలార్ మ్యాగ్జిమం రావచ్చేనేది కూడా నిర్దుష్టం కాదు. 9 సంవత్సరాల 14 సంవత్సరాల మధ్య ఈ సోలార్ మ్యాగ్జిమం స్థితి ఏర్పడొచ్చు. లాస్ట్ టైమ్ 2014-15 టైమ్ లో సోలార్ మ్యాగ్జిమంను మనం ఎక్స్ పీరియన్స్ చేశాం. మళ్లీ 2025 తర్వాత సోలార్ మ్యాగ్జిమం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి..ఈ సారి సూర్యుడి నుంచి వచ్చే తీక్షణమైన తుపానులకు భూమి మీద ఉన్న సాంకేతికత వ్యవస్థ దెబ్బతింటుందేమో అనేది ఓ అంచనా.



ఇదే వార్తలో ఇంకో విషయం ఏంటంటే వాషింగ్టన్ పోస్ట్ ఓ ప్రొఫెసర్ రాసిన కథనం ఆధారంగా ఈ వార్తను ప్రచురించింది అన్నాం కదా. ఆ ప్రొఫెసర్ పేరు సంగీతా అబ్డూ జ్యోతి..భారతీయ మూలాలన్న ప్రొఫెసర్ ఆవిడ. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. సో ఆమె మెయిన్ స్ట్రీమ్ స్పేస్ సైన్స్ ఎక్స్ పర్ట్ కాదు. జస్ట్ ఇంటర్నెట్ గురించి ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ గురించి తనకున్న అభిప్రాయాలను పేపర్ పబ్లిష్ చేశారామె. ఇదే వాష్టింగ్టన్ పోస్ట్ తో తను వాడిన ఇంటర్నెట్ అపోకలిప్స్ అనే పదం చాలా ఎక్కువ అటెన్షన్ తీసుకుందని..ప్రజలు భయపడుతున్నారని..రిగ్రెట్ కూడా ఫీలైందని వాషింగ్టన్ మరో కథనాన్ని కూడా ప్రచురించింది. 






కనుక ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలిపోవచ్చనేది ఓ కంప్యూటర్ సైన్స్ ఫ్రొఫెసర్ పర్సనల్ ఓపినీయనే కానీ నాసా, ఇస్రో లేదా మరే స్పేస్ ఏజెన్సీ లేదా శాస్త్రవేత్తలో నిర్ధారించింది కాదు. సో ఇప్పుడప్పుడే ఇంటర్నెట్ వ్యవస్థకు వచ్చిన నష్టమేం లేదన్న మాట. ఇంకో పాజిటివ్ న్యూస్ సోలార్ మ్యాగ్జిమం ప్రతీ 12ఏళ్లకు ఓ సారి ఎక్స్ పీరియన్స్ అన్నాం కదా. 2014-15 టైమ్ లో కూడా ఇలాంటి సౌరతుపానుల పుకార్లు చాలానే వచ్చాయి. కానీ అంతకు ముందు 24 ఏళ్లకంటే 2014-15 టైమ్ లోనే తక్కువ సౌర తుపానులు సంభవించాయి. ఈ గ్రాఫే దానికి ప్రూవ్. సో ఈ వార్త భయపెట్టేంత పెద్దది కాదు. సర్క్యులేట్ అయ్యేంత ఆలోచించాల్సింది కాదు. 






ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial