Electricity Bill: ఇటీవల కర్ణాటకకు చెందిన ఓ ఇంటి యజమాని కరెంటు బిల్లు చూసి కంగుతిన్నాడు. తాజాగా హైదరాబాద్ లోనూ ఇలాంటి ఘటనే రిపీట్ అయింది. అక్కడి జరిగినట్లుగానే ఇక్కడ కూడా 7 లక్షలకు పైగా కరెంట్ బిల్లు వచ్చింది. దాన్ని చూసిన ఇంటి యజమానికి గుండె ఆగినంత పనైందట. ఆ విషయాన్ని నేరుగా ఇంటి యజమాని తెలిపారు. వందల్లో వచ్చే కరెంట్ బిల్లులు వేలల్లో వచ్చాయని, చాలా మంది తనలాంటి బాధితులు ఉన్నారని చెబుతున్నారు.
అసలేం జరిగిందంటే..?
ఉప్పల్ పరిధిలోని హైకోర్టు కాలనీలో ఓ ఇంటి కరెంట్ బిల్లు (రూ. 7,97,576) ఏకంగా ఏడు లక్షల తొంబై ఏడు వేల ఐదువందల డెభై ఆరు రూపాయలు రావడంతో ఆ యజమాని గుండె గుభేల్లుమంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఖాళీగా ఉన్న పోర్షన్ కి ప్రతి నెల మూడు వందల లోపు కరెంట్ బిల్లు వచ్చేదని తెలిపింది. కానీ మే నెలకి సంబందించిన కరెంట్ బిల్లు జూన్ నెలలో వచ్చిందని.. ఆ బిల్లును ఆన్ లైన్ లో చూడగానే నోట మాట రాలేదని వివరించింది. ఇదే విషయాన్ని అధికారులకు తెలపగా.. పాత మీటర్ ను మార్చేసి కొత్తది అమర్చినట్లు వివరించారు. మీటర్ లో తప్పు వల్లే ఈ సమస్య తలెత్తిందని చెప్పినట్లు పేర్కొన్నారు.
"నా పేరు అనురాధ. ఇది మా కూతురు ఇల్లు. ఈ ఇల్లును మేము వాడుకోం. రోజూ కనీసం ఐదు నిమిషాలు కూడా లైట్లు వేయం. ప్రతీనెల మినిమం బిల్లు వస్తుంది. మాకు ఎప్పుడైనా 150, 200, 250.. ఇలా మూడు వందల్లోపే వస్తుండేది. ఈసారి మాత్రం ఏడు లక్షల చిల్లర వచ్చింది. ఇదేందని అధికారులను అఢిగితే బిల్లు జంప్ అయిందని చెప్పినట్లు వివరించారు. బిల్లు కొట్టడానికి వచ్చిన అతను ఎక్కువ వచ్చిందని... మీరు మీటర్ మార్చుకోవాలని చెప్పారు. మేం ఆన్ లైన్ లో చూసే సరికి 7 లక్షల రూపాయల బిల్లు వచ్చింది." - అనురాధ, ఇంటి యజమాని
నాలుగు రోజుల క్రితం కర్ణాటకలో..!
కర్ణాటక ఉల్లాల్ కు చెందిన సదాశివ ఆచార్య అనే వ్యక్తికి ఇటీవలే కరెంట్ బిల్లు వచ్చింది. అయితే ప్రతీనెల 2 వేల నుంచి 3 వేల వరకూ బిల్లు వచ్చేంది. కానీ జూన్ నెలలో మాత్రం ఏకంగా 7 లక్షల 71 వేల 72 రూపాయలు వచ్చింది. ఇది చూసిన సదాశివ ఆచార్య ఖంగుతిన్నాడు. అది నిజంగా తన ఇంటికే వచ్చిందా అని పదే పదే చెక్ చేశాడు. తనకే వచ్చినట్లు గుర్తించి వెంటనే సంబంధిత అధికారులను కలిశాడు. ఎప్పుడూ వేలల్లో వచ్చే బిల్లు ఈసారి ఏకంగా లక్షల్లో వచ్చిందని చెప్పి వాపోయాడు. అయితే ఆ బిల్లును తీసుకొని చెక్ చేసిన అధికారులు.. బిల్లు తప్పుగా ప్రింట్ అయినట్లు గుర్తించారు. వెంటనే దాన్ని సరి చేసి రూ.2,838 బిల్లును అతడి ఇంటికి పంపారు.
‘‘ఏజెన్సీల ద్వారా బిల్లుల సేకరణ జరుగుతుంది. ఈ (ఆచార్య) విద్యుత్ బిల్లు బిల్లు రీడర్ లోపం వల్ల తప్పుగా పరింట్ అయింది. కరెంటు బిల్లులో తప్పులుంటే వినియోగదారుడికి ఇవ్వము. సవరించిన బిల్లును ఆచార్యకు అందజేస్తాం.”అని ఉల్లాల్ మెస్కామ్ సబ్-డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఎ దయానాడ అన్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial