మలేసియాలోని ఓ బార్ వినూత్నంగా ఆలోచించింది. ప్రముఖ కరోనా వ్యాక్సిన్‌ల పేరుతో కాక్‌టైల్స్‌ను అమ్ముతోంది. వ్యాక్సినేషన్‌పై ప్రచారం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బార్ యజమానులు అంటున్నారు.
ఇక్కడ దొరికే బ్రాండ్ల పేర్లు..
ఫైజర్‌మైస్టర్, సినోసౌర్, ఎక్ట్రాజెనకా వంటి కరోనా టీకా తరహా పేర్లతో ఈ కాక్‌టైల్స్ విపరీతంగా ప్రచారమయ్యాయి. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా బ్యాక్‌డోర్ బొడెగా బార్ బోసిపోయింది. అయితే లాక్‌డౌన్ ఉపశమనాలుగా పేరు పెట్టి ఈ కాక్‌టైల్స్‌ను డోర్ డెలివరీ చేస్తున్నారు బార్ నిర్వాహకులు.
ఈ ఏడాది జూన్ నెల సమయంలో మలేసియా ప్రతి ఒక్కరూ తాము ఎప్పుడు వ్యాక్సిన్ వేసుకుంటామా అని ఆలోచించేవారు. టీకాల కోసం ఎదురుచూసేవారు. ఎందుకంటే ఇప్పుడున్నంత వేగంగా అప్పుడు వ్యాక్సినేషన్ కార్యక్రమం లేదు. అందుకే జనాల పెదాలపై ఎక్కువగా వినిపించి వ్యాక్సిన్ పేర్లనే ఈ కాక్‌టైల్స్‌కు పెట్టాలని నిర్ణయించాం. ఇవి ప్రజలకు కూడా బాగా నచ్చాయి. - కొహ్ యంగ్ షేన్, బార్ ఓనర్