Viral Video: 'డెస్క్ టాప్ దోశ' తింటారా? - ఆనంద్ మహీంద్రా మనసు మెచ్చిన మెషీన్, వైరల్ వీడియో

Anand Mahindra: ఓ హోటల్‌లో మెషీన్ సాయంతో దోశలు చేస్తోన్న వీడియో వైరల్‌గా మారింది. దీన్ని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ 'డెస్క్ టాప్ దోశ'గా అభివర్ణించారు.

Continues below advertisement

Business Man Anand Mahindra Shares Video On Dosa Machine: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. వినూత్న ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలు, మానవత్వపు విలువలు, క్రియేటివిటీకి సంబంధించిన వీడియోలను పంచుకుంటుంటారు. పలు అంశాలపై తన అభిప్రాయాలను ఆసక్తికరంగా చెబుతుంటారు. తాజాగా, ఓ దోశ మెషీన్‌‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. క్షణాల్లోనే రుచికరమైన దోశను తయారు చేసే యంత్రంపై ఆయన స్పందించారు. దీన్ని 'డెస్క్ టాప్ దోశ'గా అభివర్ణించారు. 

Continues below advertisement

నెటిజన్ వీడియోకు స్పందిస్తూ..

ఓ టిఫిన్ సెంటర్‌లో మెషీన్ సాయంతో దోశలు తయారు చేస్తోన్న వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇది '22వ శతాబ్దపు దోశ మెషీన్' అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. పట్నాలోని ఓ టిఫిన్ సెంటర్లో దీన్ని ఉపయోగిస్తున్నట్లు చెప్పాడు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. 'డెస్క్ టాప్ దోశ'గా అభివర్ణించారు. ఇది కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు. 'ఆహార పరిశ్రమల్లో భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చు. ఇలాంటి మెషీన్లు ఎంతో శ్రమను తగ్గిస్తాయి.' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'ఈ మెషీన్ చాలా బాగుంది. ఇది నా ఫేవరెట్ దోశ' అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. నిజంగా ఇలాంటి మెషీన్ వినూత్న ఆవిష్కరణే కదూ.

Also Read: Viral News: బిల్డింగ్ కూల్చాలంటూ నోటీసులు, ఆ ఓనర్ ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Continues below advertisement