Naa Anveshana Video: ఇన్‌స్టాగ్రామ్‌ బ్లాక్ చేయడం ఇన్‌ఫ్లూయిన్సర్‌ ఆన్వేష్. డబ్బులు రాని ఇన్‌స్టా పోతే తనకు ఎాలంటి నష్టం లేదన్నాడు. దాని వల్ల తనకు ఎలాంటి ప్రయోజనం లేదన్న అతను, బత్తాయిలూ అంటూ హాట్ కామెంట్స్ చేస్తూ తాజాగా మరో వీడియో విడుదల చేశాడు. 

Continues below advertisement

హిందూ దేవతలపై వల్గర్ కామెంట్స్ చేశాడన్న కారణంతో అన్వేష్‌పై చాలా ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. అక్కడితో ఆగని హిందూ సంఘాలు అతని చేస్తున్న కామెంట్స్ ఓ వర్గం వారిని రెచ్చగొట్టేలా ఉన్నాయని చెప్పి మెటా సంస్థకు ఫిర్యాదులు చేశారు. దీంతోపాటు వివిధ పోలీస్‌స్టేషన్‌లలో రిజిస్టర్ అయిన ఫిర్యాదుల గురించి కూడా తెలియజేశారు. దీనిపై స్పందించిన మెటా సంస్థ అన్వేష్‌కు చెందిన ఒక ఇన్‌స్టా అకౌంట్‌ను క్లోజ్ చేసింది. 

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్లోజ్ అవ్వడంపై అన్వేష్‌ ఘాటుగా స్పందించాడు. ఆయన ఏమన్నాడంటే" నా ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ క్లోజ్ అయినందుకు చాలా బాధపడుతున్నాను అని అంటాను అనుకున్నారా బత్తాయిలూ? రూపాయి రాని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పోతే ఏంటీ ఉంటే ఏంటీ నా ఈ... "అని బూతులతో రెచ్చిపోయాడు. 

దొరికితే తన తల తీసేయాలే తప్ప ఇలా ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియాను బ్యాన్ చేయాలనే పోరాటం ఏంటని అన్వేష్‌  ప్రశ్నించాడు. "ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలూ. రెండు చేతులు నా ఇన్‌స్టాగ్రామ్స్ అన్నమాట. రెండు కాళ్లు నా రెండు యూట్యూబ్ ఛానల్స్ అన్నమాట. నా బాడీ ఫేస్‌బుక్ అన్నమాట.ఈ ఐదింటిని నడిపించేది తెలివైన బుర్ర. ఇంత మంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే ఆ బుర్ర. బత్తాయిలందరూ కలిసి నా చేయిని విరగ్గొటేశారు. అయితే నాకు ఇంకో చేయి ఉంది. రెండు కాళ్లు ఉన్నాయి. నడుచుకుంటూ వెళ్లిపోతాను. ఇప్పుడు మరో ఇన్‌స్టాగ్రామ్‌ను కూడా విరగొట్టేశారు. రెండు కాళ్లతో పరుగెత్తుకొని వెళ్లిపోతాను. ఇప్పుడు కాలిని తీసేశారు. ఒంటికాలితో కుంటుకూ వెళ్తాను. రెండో కాలిని కూడా తీసేశారు. బాడీతో వెళ్తాను. బాడీ కూడా తీసేశారు. తల ఉంది. అమ్మెమ్మెమ్మె అని మాట్లాడుకుంటూ వెళ్లిపోతాను. మీకు దొరికితే తీయాల్సింది ఏంటీ తల. శంభాజీ మహరాజ్‌కి ఎగురుతుంది కదా తల అలా ఎగరాలన్నమాట. నేను ఎవడ్నీ దేకను. ఇన్‌స్టాగ్రామ్ పోయింది. అది పోయింది ఇది పోయింది. పనికొచ్చే పనులు చేయండ్రా. 

ఇన్‌స్టాగ్రామ్‌తో తనకు పైసా ఉపయోగం లేదన్నాడు అన్వేష్‌. ఇంత చేస్తున్నా తనకు యూట్యూబ్‌ వల్ల ఆదాయం పెరిగిందని, బ్యాంకు నుంచి కూడా వడ్డీ రూపంలో బాగానే వస్తుందని చెప్పుకొచ్చాడు. "నాకు ఏమైనా ఉపయోగం ఉందా ఇన్‌స్టాగ్రామ్‌తోని. నేను ఏమైనా ప్రమోషన్స్‌చేశానా, ఏదైనా లింక్ ఇచ్చానా, నేను ఎవడినైనా మోసం చేశానా, నాకు ఎందుకు ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్ ఉంటే ఏంటీ పోతే ఏంటీ. అదిదా యూట్యూబ్‌, అందులో లాస్ట్ మంత్‌ 8 లక్షలు వచ్చాయి. బ్యాంకు నుంచి ఇంట్రెస్ట్ 9 లక్షల లాభమా. అదే ఇన్‌స్టాగ్రామ్ ఉంటే ఏంటీ పోతే ఏంటీ. వినాయకుడిపై ప్రమాణం చేసి చెబుతున్నాను. బత్తాయిలను క్షేమించేదే లేదు. నిద్ర పోనివ్వను. నరకం చూపిస్తాను. నేను ఎవర్నీ దేకమన్నా దేకను. నాకు కావాల్సింది ఆరోగ్యం. అది బాగానే ఉంది. వీళ్లంతా పోతే ఏంటీ ఉంటే ఏంటీ. మనుషుల ప్రాణాలే పోతున్నాయి. రేపటి నుంచి రోజూ వీడియో వత్తది. " అని చెప్పుకొచ్చాడు.