Podharillu Serial Today Episode: మహాలక్ష్మీని ఎలాగైనా ఇంటికి రప్పించాలని పథకం వేసిన వాళ్ల అమ్మ...నిహారికతో ఆమెకు ఫోన్ చేయిస్తుంది. జాబ్‌కోసం సర్టిఫికేట్లు తీసుకెళ్లడానికి రమ్మని చెబుతుంది. ఆమాటలు విన్న మహాలక్ష్మీ ఎంతో సంతోషిస్తుంది. మీ అమ్మగారే నీకు సర్టిఫికేట్లు ఇవ్వమన్నారని చెప్పడంతో ఆనందపడుతుంది. అయితే ఒరిజనల్ సర్టిఫికేట్లు కావాడం వల్ల నువ్వే వచ్చి నేరుగా తీసుకోమని చెబుతుంది. కొరియర్‌లో పంపించడం కుదరదని చెబుతుంది. అయితే మహా సరేనని చెప్పి ఈ విషయం మాధవ్‌కు చెబుతుంది. దీనికి చక్రి చాలా భయపడిపోతాడు. నవ్వు ఒక్కదానివే మీ ఇంటికి వెళ్తే వాళ్లు ఏదైనా చేస్తారేమోనని అంటాడు. అలాంటి భయమేమీ లేదని...మా వాళ్లకు నాపై కోపం ఉన్నంతమాత్రాన చంపేంత కక్ష లేదని అంటుంది. అయితే నేనుకూడా వస్తానని చక్రి అనడంతో నిన్ను చూస్తేనే వాళ్లు చాలా కోపంగా ఉన్నారని..ఇప్పుడు మళ్లీ అక్కడికి వస్తే గొడవలు చేస్తారని చెబుతుంది. ఏదీఏమైనా మళ్లీ నిన్ను ఒక్కదాన్నే పంపించాలంటే భయంగా ఉందని మాధవ్ అంటాడు. కన్నాను కూడా నీతోనే పంపిస్తానని చెప్పడంతో ఆమె సరేనని అంటుంది. ఆమె ఇంటికి వెళ్లడానికి బయలుదేరతుండగా.....ఎలాగైనా ఈ ప్రయాణం ఆపాలని చక్రి ట్రై చేస్తుంటాడు. అంతలో అక్కడికి వచ్చిన మాధవ్‌ ఏం కాదులేరా  అనిఅంటే...వాళ్ల సంగతి నీకు తెలియదన్నయ్య...ఏదో ఒకటి చెప్పి మహాను మళ్లీ ఇక్కడికి రానివ్వకుండా  ఆపేస్తారని అంటాడు. ఇప్పటికే వాళ్ల నాన్న ఓసారి ఆత్మహత్యాయత్నం  చేశాడని...ఇప్పుడు మళ్లీ అలాగే బెదిరించి  ఉంచేస్తారన్న భయంంగా ఉందని అంటాడు. అసలే మహా మాకు జరిగింది పెళ్లిలాగే ఫీలవ్వడం లేదని...వాళ్లు చూపిన ప్రేమకు కరిగిపోయి ఉండిపోతుందేమోనని భయంగా ఉందని అంటాడు. అలాంటిదేమీ జరగదులే అని మాధవ్ భరోసా ఇస్తాడు.                       మహావాళ్ల అమ్మకూడా  తన భర్తకు ఈవిషయం చెబుతుంది. తను ఇప్పుడు ఇక్కడికి వస్తుందని మీరు తనని ఏమీ అనకూడదని అంటుంది. దీనికి ప్రతాప్ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మనల్ని కాదనుకుని వెళ్లిపోయిన దాని గురించి మనకు ఎందుకని అంటాడు. అది తప్పు చేస్తే మనం కూడా అలాగే వదిలేద్దామా అని అంటుంది. అయితే  అది నిజంగానే  తన తప్పు తెలుసుకుని ఇక్కడ ఉండటానికి వస్తే నాకు అభ్యంతరం లేదని చెబుతాడు. ఆది కూడా సరేననంటాడు. వెంటనే కలుగజేసుకున్న నిహారిక....మీరు ఏదేదో ఊహించుకుంటున్నారని..మహాకు చట్టప్రకారం పెళ్లి అయ్యిందని అంటుంది. తను అక్కడ ఇబ్బందిపడుతున్నానని  చెప్పిందే గానీ....ఇక్కడికి శాశ్వతంగా వచ్చేస్తానని చెప్పలేదు అని అంటుంది. ఒకసారి రానివ్వు ఇక్కడే ఉండేలా నేను చేస్తానని వాళ్ల అమ్మ అంటుంది. అటు మహా కన్నాతో బయలుదేరి  యాదగిరిగుట్ట వచ్చేస్తుంది.                                   యాదగిరిగుట్టలో ఆటో దిగిన వెంటనే మహా వాళ్ల వదినకు ఫోన్ చేసి మాట్లాడుతుంది.నేను వచ్చేశాను సర్టిఫికేట్లు తెచ్చి ఇవ్వమని చెబుతుంది.ఇంటికి రమ్మని నిహారిక కోరుతుంది.మీనాన్న,అన్నయ్య ఇంట్లో లేరని చెప్పడంతో కన్నాను తీసుకుని మహా ఇంటికి వస్తుంది. వాళ్ల అమ్మ కన్నాను చూసి మండిపడుతుంది. ఎవడు వీడు అని నిలదీస్తుంది. చక్రి వాళ్ల తమ్ముడని చెప్పడంతో  గేటు బయటే ఉండమని చెప్పి ...తనను మాత్రం లోపలికి తీసుకెళ్తుంది.అక్కడ వాళ్ల అన్నయ్య, నాన్నను చూసి షాక్‌కు గురవుతుంది. వెళ్లివాళ్ల నాన్నతో మాట్లాడుతుంది. అక్కడ కొంచెం సంవాదం జరిగిన తర్వాత వాళ్ల అమ్మ ఆ పెళ్లిని మర్చిపోయి ఇక్కడే ఉండమని చెబుతుంది. దీనికి మహా ఒప్పుకోదు....ఇప్పుడు మీకు ఏం చెప్పినా అర్థం కాదని అంటుంది. నేను ఇంట్లో నుంచి పారిపోయి వెళ్లిపోయిందే....నా చదవుకు సార్థకత దొరికే ఉద్యోగం చేయడానికని ఇప్పుడు నేను అవన్నీ వదులుకుని వస్తే నేను తప్పు చేసిన దానిని అవుతానని అంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ  నేను వెనక్కి రానని తెగేసి చెబుతుంది.