Jagadhatri Serial Today Episode : ముఖ్యమంత్రిని కాపాడేందుకు జేడీ, కేడీ ఇద్దరూ తమ ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తుంటారు.అదే సమయంలో మీనన్‌ మనిషి టీనాను జేడీ పట్టుకుటుంది.అటు పోలీసులు మేనేజర్ రావుగా ఫ్యామిలీని కాపాడతారు. జేడీ టీనాను కొట్టి బాంబును కంట్రోల్ చేసే రిమోట్ ఇవ్వమని బెదిరిస్తుంది. ఇప్పుడు ఆఫీసులో  ఎవరూ లేరని రెండు నిమిషాల్లో సీఎం కూడా  వెళ్లిపోతాడని జేడీ చెబుతుంది.ఇక్కడ బాంబు పేలితే నువ్వు, నేను తప్ప ఎవరూ చనిపోరాని హెచ్చరిస్తుంది. మర్యాదగా  రిమోట్ ఇస్తే నువ్వు ప్రాణాలతో మిగులుతావని అంటుంది. దీంతో టీనా ఆమెకు రిమోట్ ఇచ్చేస్తుంది. జేడీకి తన ప్లాన్ తెలిసిపోయింది కాబట్టి  ఎట్టి పరిస్థితుల్లోనూ బాంబులు పేలకుండా చూసుకుంటుందని...అదే జరిగితే ఇవాల్టితో నా కథ ముగిసిపోయినట్లేనని మీనన్ అనుకుని నేరుగా రంగంలోకి దిగుతాడు. బయట ఉన్న సెక్యూరీటీ పోలీసులు అందరినీ చంపేసి నేరుగా సీఎం ఉన్న ఫస్ట్‌ప్లోర్‌కు వెళ్లిపోతాడు. అప్పుడే సీఎంను జాగ్రత్తగా పంపించేందుకు కేదార్ తీసుకెళ్తుంటాడు.              సీఎం ఉన్న ప్లోర్‌కు వచ్చిన మీనన్‌ అక్కడ ఉన్న సెక్యూరిటీని కూడా చంపేస్తాడు. దీంతో కౌషికితోపాటు అందరూ భయపడిపోతారు.సీఎంను తాను కిడ్నాప్ చేస్తున్నానని మర్యాదగా సహకరించాలని లేకపోతే అందరినీ చంపేస్తానని అంటాడు. కేదార్‌ను బెదిరించి అతనిని కూడా అదుపుచేస్తాడు. అసలు తనకు సీఎను కిడ్నాప్ చేసే ఉద్దేశం లేదని...కాకపోతే ఈ కౌషికి చేసిన పనివల్లే ఇదంతా జరిగిందని చెబుతాడు.మర్యాదగా నేను జడ్జిని చంపుతున్న వీడియో నాకు ఇచ్చేయకపోతే ముందు నిన్నే చంపేస్తాని కౌషికిని బెదిరిస్తాడు.సీఎం మాత్రం ఆ వీడియో ఇవ్వొద్దనిచెప్పినా....కౌషికి వీడియో ఉన్న పెన్‌డ్రైవ్‌ మీనన్‌కు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా....సురేష్‌ మీనన్ చేతిని ఎగరగొడతాడు.దీంతో సురేష్‌ను తుపాకీతో కాల్చేందుకు మీనన్‌ ప్రయత్నించగా....జేడీ వచ్చి అడ్డుపడుతుంది.దీంతో ఆమెకు బుల్లెట్‌ గాయం అవుతుంది. జేడీని చూసిన మీనన్ ఆగిపోతాడు. నా చేతిలో ఓడిపోతున్నావ్‌ అని హేళన చేస్తాడు. ఇప్పుడు ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకుని జైలులో ఉన్న నావాళ్లందరినీ విడిపించుకుంటాననిఅంటాడు. ముందుగా హోంమంత్రి తాయర్‌ను బయటకు తీసుకొస్తానని చెబుతాడు. ఇక ఈ  రాష్ట్రంలో నాకు అడ్డే ఉండదని విర్రవీగుతుంటాడు.ఇంతలో జేడీ మీనన్‌కు తుపాకీ గురిపెడుతుంది. నువ్వు నన్ను కాల్చలేవని....ఎందుకంటే నేను నీకు ప్రాణాలతో కావాలని మీనన్ అంటాడు. అంతవరకు వస్తే నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడనని అంటాడు. వీరిద్దరూ మాట్లాడుతుండగానే కేదార్ అలెర్ట్ అయి మీనన్ పక్కన ఉన్న రౌడీలను కాల్చిపడేస్తాడు. జేడీ గురిచూసి మీనన్‌పై తూటాల వర్షం కురిపిస్తుంది.అంతే కుర్చీలో కూర్చున్నోడు కూర్చున్నట్లే చనిపోతాడు.                          మీనన్‌ చనిపోయిన వార్త టీవీలోచూసి సుధాకర్‌ కంగారుపడి అందరినీ పిలుస్తాడు.అక్కడికి వచ్చిన యువరాజు, కమలాకర్‌ భాయ్‌ అంత త్వరగా చనిపోయేరకం కాదని అంటాడు. దీంతో నిషిక వాడేమన్న దేవుడా చనిపోకపోవడానికి....పోలీసులు రౌడీలను చంపడం మామూలే కదా మీరు ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నారని అంటుంది. అందరూ చనిపోవడం వేరు...మీనన్ చనిపోవడం వేరని యువరాజు అంటాడు. మీనన్ చనిపోయాడంటే నేను నమ్మలేకున్నా అని అంటాడు.అయితే కౌషికి ఫోన్ చేసి విషయం కనుక్కోమని సుధాకర్‌ చెబుతాడు. మీనన్‌ చనిపోయాడు కాబట్టి మనకు వచ్చిన ఇబ్బంది ఏమీలేదని నిషిక అంటుంది. చనిపోయింది మీనన్‌ మాత్రమేనని అతని గ్యాంగ్‌ మనల్ని వదిలిపెట్టరని యువరాజు అంటాడు. మీనన్‌చనిపోయిన తర్వాత వాడి గ్యాంగ్ ఎప్పుడో పారిపోయి ఉంటుందని నువ్వు భయపడొద్దని సుధాకర్ ధైర్యం చెబుతాడు. మీనన్ కేసు విచారణ జరిపిన పోలీసులకు నా వ్యవహారం కూడా బయటపడుతుందని వైజయంతి భయపడుతుంది. బుల్లెట్ గాయలతో ఆస్పత్రిలో జేడీ చికిత్స తీసుకుంటుంది.ఆమెకుఏమైనా జరుగుతుందేమోనని కేదార్ చాలా భయపడుతుంటాడు.