Young Woman Forceful Death In Mancherial District: చిన్న చిన్న కారణాలకే కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతూ.. తల్లిదండ్రులకు తీవ్ర దుఃఖాన్ని మిగుల్చుతున్నారు. సెల్ ఫోన్ బాగు చేయించలేదని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల (Mancherial) జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల (Velala) గ్రామానికి చెందిన ప్యాగ సారక్క, స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కుమార్తె సాయిసుమ (19) మంచిర్యాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇటీవల ఆమె ఫోన్ పాడైంది. దీంతో ఫోన్ రిపేర్ చేయించాలని తల్లిదండ్రులను అడిగింది. ఎక్కువగా ఫోన్ లోనే కాలక్షేపం చేస్తున్నావని.. తరచూ ఫోన్ పాడు చేస్తున్నావని తల్లి యువతిని మందలించింది. కొద్ది రోజుల తర్వాత బాగు చేయిస్తామని చెప్పింది. దీంతో మనస్తాపం చెందిన యువతి.. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం ఇంటికొచ్చిన సోదరుడు ఎంతకీ తలుపులు తీయకపోవడంతో కిటికీ లోంచి చూడగా షాకయ్యాడు. స్థానికులు, తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. యువతి మృతితో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.


Also Read: Mahabubabad News: నాడు కన్నబిడ్డలకు విషమిచ్చి చంపారు - నేడు ఆత్మహత్య చేసుకున్నారు, కుళ్లిన స్థితిలో మృతదేహాలు!