Synoptic features of weather inference for Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీలు నమోదు అవుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు వేగంగా వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీలో వాతావరణం మరికొన్ని రోజులపాటు పొడిగా మారుతుంది. ఓ వైపు మధ్యాహ్నం పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నా, రాత్రి వేళల్లో చలి గాలుల ప్రభావం అధికంగా ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొన్నాయి.
ఉత్తర కోస్తాంధ్ర యానాంలో..
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో మధ్యాహ్నం ఉక్కపోత వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న బలమైన వేడిగాలుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీకాకుళం జిల్లాలో 39.7 డిగ్రీల ఎండ ఉంటుందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. మార్చి 15 న ఉత్తర భారతదేశం నుంచి వీచనున్న పొడిగాలుల వల్ల ఎండల తీవ్రత మరింత అధికం అవుతుంది. కొన్ని చోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. విశాఖలో అయితే ఇక ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతారు. నందిగామలో 38 డిగ్రీలు, అమరావతిలో 37.5 డిగ్రీలు, విశాఖపట్నంలో 36 డిగ్రీలు, కాకినాడలోనూ 36 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో పగటి పూట వేడి అధికంగా ఉంటుంది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న వేడి గాలుల ప్రభావంతో ప్రకాశం, కర్నూలు, గుంటూరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఉక్కపోత ఎక్కువ అవుతుంది. రోజుకు కనీసం 5 లీటర్ల వరకు మంచి నీళ్లు తాగాలని అధికారులు సూచించారు. రాత్రులు కాస్తంత చల్లగా ఉన్నా మధ్యాహ్నాలు మాత్రం ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది. రానున్న పది రోజుల దాక ఇదే పరిస్ధితి. జాగ్రతలు తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్తే గొడుగు తీసుకెళ్లాలని, కొబ్బరి బొండాలు, పళ్ల రసాలు తాగడం ద్వారా డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటారని పేర్కొన్నారు. కర్నూలులో 37.8 డిగ్రీలు, నంద్యాలలో 38 డిగ్రీలు, అనంతపురంలో 37 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణ వెదర్ అప్‌డేట్
తెలంగాణలోనూ వేడి, ఉక్కపోత రోజురోజుకూ పెరిగిపోతోంది. రాష్ట్రంలోని తూర్పు ప్రాంతాలైన సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండ, భద్రాద్రి, ములుగు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలతో వాతావరణం పొడిగా మారుతుంది. నల్గొండలో 39.2 డిగ్రీలు, భద్రాచలంలో 38.2 డిగ్రీలు, హైదరాబద్ లో వేడిగా 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయి.
Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్ - దిగొచ్చిన బంగారం ధర, రూ.500 తగ్గిన వెండి ! లేటెస్ట్ రేట్లు ఇవీ