బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్‌ తీరం వద్ద అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించింది. అల్పపీడన ప్రాంతం నుంచి ఒడిశా మీదుగా తెలంగాణ వరకూ 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో బుధవారం అక్కడక్కడ భారీగా, గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. 



మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ అక్కడక్కడ  వర్షాలు కురిశాయి. అత్యధికంగా దోమలపల్లి(నల్గొండ జిల్లా)లో 4.9, నల్గొండలో 4.8, కోహెడ(సిద్దిపేట)లో 4.3, రావినూతల(ఖమ్మం)లో 4.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంతకుముందు సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా చిట్కుల్‌ (మెదక్‌)లో 14.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.



 తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారలు వెల్లడించారు. ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిస్తాయని చెప్పారు అధికారులు.  పీలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురిస్తాయని తెలిపింది ఐఎండీ. విశాఖ జిల్లాలో పలు చోట్ల వర్షం ఎక్కువగా పడింది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.



ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు ఉరుములతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రాలోని న్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. రేపు (గురువారం) ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కరిసే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమలో మరో రెండు రోజుల పాటు ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.


 


Also Read: Horoscope Today:ఈ రాశులవారు అప్రమత్తంగా ఉండాలి, ఈ రోజు ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి